Breaking News

ఎయిర్ ఇండియాలోకి విస్తారా: ఆ రోజే చివరి ఫ్లైట్

Published on Fri, 08/30/2024 - 18:57

ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా (Vistara).. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలోకి విలీనం కానుంది. 2024 నవంబర్ 11న విస్తారా తన చివరి విమానం నడపనుంది. అంతకంటే ముందు (సెప్టెంబర్ 3) సంస్థ టికెట్ రిజర్వేషన్లను కూడా ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌కు మళ్ళించనున్నట్లు సమాచారం. అయితే విమాన ప్రయాణాలు మాత్రం నవంబర్ 11వరకు కొనసాగుతాయి.

విస్తారా సంస్థ.. ఎయిర్ ఇండియాలో విలీనం కావడానికి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అంటే ఎయిర్ ఇండియాలో విలీనం కానున్న విస్తారాలో.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ 25.1 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.

ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ & ఏఐ ప్రిఫిక్స్‌తో విస్తారా నెట్‌వర్క్.. విమానాలు కొనసాగుతాయి. విస్తారా సిబ్బంది.. విస్తారా విమానాలను 2025 ప్రారంభం వరకు ఎయిర్ ఇండియా కింద నిర్వహిస్తారు. అయితే సర్వీస్ లెవల్స్, భోజనం, ఇతరత్రా కార్యకలాపాలు ఎయిర్ ఇండియా పాలసీ ప్రకారం ఉంటాయి.

ఇప్పటికే విస్తారా ఫ్లైట్ టికెట్ నవంబర్ 11 తరువాతకు బుక్ చేసుకుని ఉంటే.. ఎయిర్ ఇండియాలో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ప్రయాణానికి ఏ లోటు లేదు. కానీ మీరు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)