Breaking News

‘ఏటా రూ.50 లక్షలు సరిపోతుందా?’ అంటూ పోస్ట్‌

Published on Thu, 06/12/2025 - 12:09

ప్రముఖ కంపెనీ, సరిపడే అనుభవం, నైపుణ్యాలు ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు జీతాలు రూ.లక్షల్లో ఉంటాయని తెలిసిందే కదా. అయితే పెరుగుతున్న జీవనశైలి, ఖర్చులకుతోడు బెంగళూరు వంటి లివింగ్‌ కాస్ట్‌లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ జీతం ఏమాత్రం సరిపోదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగంలో బెంగళూరులో నివసిస్తున్నవారికి సంవత్సరానికి రూ.50 లక్షలు (ఎల్‌పీఏ) సరిపోతుందా.. అని సామాజిక మాధ్యమాల వేదికగా టెకీలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కొందరికి రూ.50 లక్షలు ఇస్తున్నా దాని విలువ సగానికి తగ్గి రూ.25 లక్షలకు సమానమైందా? అంటూ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ధ్రువీకరించాలని కోరుతున్నారు. అవికాస్తా వైరల్‌గా మారుతున్నాయి.

ఇదీ  చదవండి: ‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’

సౌరవ్‌ దత్తా అనే టెకీ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేస్తూ..‘బెంగళూరు ఐటీ పరిశ్రమలో చాలా మంది రూ.50 ఎల్‌పీఏ సంపాదిస్తున్నారని విన్నాను. వారు పెరిగిన సీటీసీ లేదా రూ.50 ఎల్‌పీఏ రూ.25 ఎల్‌పీఏతో సమానమని చెబుతున్నారు. కొంతమంది టెక్కీలు ధ్రువీకరించగలరా?’ అని కోరారు. అందుకు ప్రతిస్పందనగా నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. రూ.50 ఎల్‌పీఏ కూడా నగరంలోని హై కాస్ట్ టెక్ వాతావరణంలో సరిపోదని కొందరు పేర్కొన్నారు. ‘రూ.50 ఎల్‌పీఏ ప్రస్తుతం రూ.10 ఎల్‌పీఏతోనే సమానం. చాలా మంది రూ.1 కోటి కంటే ఎక్కువే సంపాదిస్తున్నారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. బెంగళూరులో రూ.1 కోటి కంటే ఎక్కువ సంపాదించకపోతే సమయం వృథా అని మరొకరు కామెంట్ చేశారు. సామాన్లు ప్యాక్ చేసుకుని వెళ్లిపోవడమే బెటర్ అని సూచించారు.

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)