Breaking News

టెస్లా బాటలోనే మరో కంపెనీ

Published on Mon, 07/28/2025 - 14:02

భారత్‌లో టెస్లా అరంగేట్రం చేసిన కొన్ని రోజుల్లోనే వియత్నాం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్‌ ఇండియాలో తన మొదటి షోరూమ్‌ను గుజరాత్‌లోని సూరత్‌లో ప్రారంభించింది. సూరత్‌లోని పిప్లోడ్‌లో 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫెసిలిటీ ప్రొడక్ట్ ఎక్స్‌పీరియన్స్, వాహన అమ్మకాలు, సర్వీస్‌ సపోర్ట్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ షోరూమ్‌లో విన్‌ఫాస్ట్‌ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు వీఎఫ్ 6, వీఎఫ్ 7లను ప్రదర్శిస్తుంది.

విన్‌ఫాస్ట్‌ వీఎఫ్ 7, వీఎఫ్ 6 మోడళ్లలో రైట్‌హ్యాండ్‌ డ్రైవ్ వెర్షన్‌ను మొదటిసారి ఇండియాలోనే విడుదల చేస్తున్నట్లు చెప్పింది. ఈ ఏడాది చివరి నాటికి 27 నగరాల్లో 35 డీలర్‌షిప్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. విన్‌ఫాస్ట్‌ తన ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల కోసం 2025 జులై 15న అధికారికంగా బుకింగ్‌లను ప్రారంభించింది. ఎక్స్‌క్లూజివ్‌ షోరూమ్‌ల్లో లేదా అధికారిక వెబ్‌సైట్‌ VinFastAuto.in ద్వారా రూ.21,000 పూర్తిగా రీఫండబుల్ అమౌంట్‌తో బుక్ చేసుకోవచ్చని చెప్పింది.

ఇదీ చదవండి: బంగారు బాతులను చంపేస్తున్నారు.. దేశానికి సిగ్గుచేటు

తమిళనాడులోని తూత్తుకుడిలో రాబోయే రోజుల్లో విన్‌ఫాస్ట్‌ ఏర్పాటు చేయనున్న కర్మాగారంలో ఈ వాహనాలను స్థానికంగా అసెంబుల్ చేస్తామని పేర్కొంది. విన్‌ఫాస్ట్‌ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ మాట్లాడుతూ..‘భారతీయ వినియోగదారులకు విన్‌ఫాస్ట్‌ డ్రైవింగ్‌ అనుభవాన్ని చేరువ చేయబోతున్నందుకు సంతోషిస్తున్నాం’ అని చెప్పారు. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2020లో కేవలం 5,000 యూనిట్ల నుంచి 2024 నాటికి 1,13,000 యూనిట్లకు పుంజుకుంది. ప్రస్తుతం మొత్తం కార్ల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 3 శాతం కంటే తక్కువగా ఉండగా, 2030 నాటికి ఈ వాటాను 30 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)