విన్‌ఫాస్ట్: మొన్న కార్లు.. ఇప్పుడు స్కూటర్

Published on Fri, 01/23/2026 - 21:19

వియత్నామీస్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఇప్పటికే.. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది.

విన్‌ఫాస్ట్ 2026 ద్వితీయార్థంలో.. ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. వీటిని కూడా కంపెనీ తమిళనాడులోని ప్లాంట్ నుంచి మార్కెట్‌కు సరఫరా చేయనుంది. మన దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ అంచెలంచెలుగా విస్తరిస్తున్న తరుణంలో.. ఆ విభాగంలో సంస్థ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సంస్థ సంకల్పించింది.

విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్లు
విన్‌ఫాస్ట్ VF6: విన్‌ఫాస్ట్ వీఎఫ్6 ఎలక్ట్రిక్ కారు.. ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇది స్ప్లిట్ హెడ్‌లైట్, టెయిల్‌లైట్ సెటప్‌లు పొందుతుంది. లేటెస్ట్ డిజైన్ కలిగిన ఈ కారు.. కొత్త ఫీచర్స్ పొందుతుంది. మూడు ట్రిమ్ (ఎర్త్, విండ్, ఇన్ఫినిటీ) లెవెల్స్‌లో అందుబాటులో ఉన్న ఈ కారు 59.6 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఎర్త్ వేరియంట్ 468 కిమీ రేంజ్ అందిస్తుంది. మిగిలిన రెండూ కూడా 463 కిమీ రేంజ్ అందిస్తాయి.

విన్‌ఫాస్ట్ VF7: టేపింగ్ రూఫ్‌లైన్, యాంగ్యులర్ రియర్ విండ్‌షీల్డ్‌తో స్ట్రీమ్‌లైన్డ్ ప్రొఫైల్‌ కలిగిన విన్‌ఫాస్ట్ వీఎఫ్7, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటివి పొందుతుంది. ఐదు వేరియంట్లలో లభించే ఈ కారు 59.6 కిలోవాట్, 70.8 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలను పొందుతుంది. రేంజ్ అనేది వరుసగా 438 కిమీ, 532 కిమీ వరకు ఉంది.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)