Breaking News

టెక్ మహీంద్రా మాజీ చీఫ్ వినీత్ నయ్యర్ కన్నుమూత

Published on Thu, 05/16/2024 - 14:41

టెక్ మహీంద్రా లిమిటెడ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ (85) కన్నుమూశారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారు. వినీత్ నయ్యర్ మృతిపై పలువురు ప్రముఖలు తమ సంతాపాన్ని తెలియజేశారు.

"భారత్‌ ఈరోజు అత్యుత్తమ నాయకుడిని కోల్పోయింది" అని టెక్ మహీంద్రా మాజీ సీఈవో సీపీ గుర్నానీ నయ్యర్ మరణానికి సంతాపాన్ని తెలియజ్తేస్తూ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పోస్ట్ చేశారు.

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా నయ్యర్ మృతికి ‘ఎక్స్‌’ పోస్ట్‌లో సంతాపం తెలిపారు. "భారతీయ వ్యాపార రంగంలో వినీత్ అతి పెద్ద వ్యక్తి" అని పేర్కొన్నారు. టెక్ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ‘ఎక్స్‌’లో వినీత్‌ మృతికి సంతాపం వ్యక్తం చేసింది.

1939లో జన్మించిన నయ్యర్ మసాచుసెట్స్‌లోని విలియమ్స్ కళాశాల నుంచి డెవలప్‌మెంట్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఐఏఎస్‌ అధికారిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన 40 ఏళ్ల కెరీర్‌లో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ కార్పొరేట్ రంగాల్లో పనిచేశారు. పదేళ్లకుపైగా ప్రపంచ బ్యాంకులో పనిచేసిన ఆయన పలు కీలక పదవులను నిర్వహించారు. 2009లో కుప్పకూలిన కంప్యూటర్ సేవల సంస్థ సత్యం పునరుద్ధరణలో నయ్యర్ కీలక పాత్ర పోషించారు.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)