Breaking News

వీడియో స్ట్రీమింగ్‌ రంగంలో 2.8 లక్షల మందికి ఉపాధి

Published on Wed, 07/24/2024 - 13:37

భారత్‌లో ఆన్‌లైన్‌ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ మార్కెట్‌ 2028 నాటికి దాదాపు రూ.1.08 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తుందని ‘మీడియా పార్టనర్స్ ఏషియా’ నివేదిక తెలిపింది. రానున్న నాలుగేళ్లలో ఈ పరిశ్రమలో 2.8 లక్షల ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది.

నివేదికలోని వివరాల ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో వీడియో మార్కెట్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో సేవలందిస్తున్న కంపెనీలు అమలు చేస్తున్న ప్రీమియం వల్ల వీడియో ఎంటర్‌టైన్‌మెంట్ ఎకానమీ 2028 నాటికి 8 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా. 2018లో ఈ ఇండస్ట్రీ మార్కెట్‌ విలువ రూ.27 వేలకోట్లుగా ఉంది. 2023లో ఇది రూ.48 వేలకోట్లకు పెరిగింది. 2028 నాటికి వీడియో స్ట్రీమింగ్‌ మార్కెట్‌ విలువ రూ.1.08 లక్షల కోట్లుకు చేరుకుంటుందని అంచనా. దానివల్ల దాదాపు 2.8 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.

ఇదీ చదవండి: బడ్జెట్‌ 2024-25.. రియల్టీ ఇన్వెస్టర్లకు చుక్కెదురు..?

ఈ సందర్భంగా మీడియా పార్టనర్స్ ఏషియా మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ కూటో మాట్లాడుతూ..‘నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ కంపెనీలు భారత్‌లో స్థానిక కంటెంట్‌ను కొనుగోలు చేయడానికి ఏటా సుమారు రూ.4 వేలకోట్లు వెచ్చిస్తున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన జియో సినిమా క్రీడలను ప్రసారం చేయడానికి ఏటా సుమారు రూ.8,300 కోట్లు ఖర్చు చేస్తోంది’ అన్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)