Breaking News

రిలయన్స్‌ అనుబంధ సంస్థగా కొత్త కంపెనీ

Published on Thu, 01/02/2025 - 21:51

మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ వయాకామ్‌18 (Viacom18) మీడియా అనుబంధ కంపెనీగా అవతరించినట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) తాజాగా పేర్కొంది. తప్పనిసరిగా మార్పిడికిలోనయ్యే 24.61 కోట్ల ప్రిఫరెన్స్‌ షేర్ల(సీసీపీఎస్‌)ను అదే సంఖ్యలో ఈక్విటీ షేర్లుగా మార్పు చేసినట్లు వెల్లడించింది.

దీంతో ప్రత్యక్ష సబ్సిడియరీగా మారినట్లు తెలియజేసింది. ఇప్పటివరకూ రిలయన్స్‌ అనుబంధ కంపెనీ నెట్‌వర్క్‌18 మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు వయాకామ్‌18 మీడియా మెటీరియల్‌ సబ్సిడియరీగా వ్యవహరించేది. కాగా.. తాజా మార్పు కారణంగా వయకామ్‌18లో రిలయన్స్‌ వాటా 70.49 శాతం నుంచి 83.88 శాతానికి ఎగసింది.

అంతకుముందు 2024 మార్చిలో పారామౌంట్‌ గ్లోబల్‌ నుంచి వయాకామ్‌18లో 13.01 శాతం వాటాను రిలయన్స్‌ చేజిక్కించుకుంది. ఇందుకు రూ. 4,286 కోట్లు వెచ్చించింది. ఈ ఏడాది నవంబర్‌ 14న వాల్ట్‌ డిస్నీ దేశీ మీడియా బిజినెస్‌తో రిలయన్స్‌ మీడియా విభాగాలను విలీనం చేయడంతో రూ. 70,000 కోట్ల విలువైన దేశీ మీడియా దిగ్గజం ఆవిర్భవించిన విషయం విదితమే.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి