Breaking News

కొత్త టెక్నాలజీతో ఫ్యాన్‌లు ఆవిష్కరణ

Published on Thu, 07/17/2025 - 12:31

ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీ సంస్థ బీఎల్‌డీసీ టెక్నాలజీతో నడిచే వీ-గార్డ్ కొత్త ఎయిర్ విజ్ సిరీస్ సీలింగ్‌ ఫ్యాన్లను ఆవిష్కరించినట్లు తెలిపింది. వీటిలో స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. హైస్పీడ్ ఎయిర్ ఫ్లోతో కేవలం 35 వాట్ల విద్యుత్ వినియోగంతో ఇవి పనిచేస్తాయని చెప్పింది. 4/8 గంటల ఆటో-ఆఫ్ టైమర్‌తో రిమోట్ ఆపరేట్ సదుపాయం ఉందని పేర్కొంది.

ఎయిర్ విజ్ సిరీస్‌లో భాగంగా విభిన్న వేరియంట్లను పరిచయం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఎయిర్‌విజ్‌ లైట్‌, ఎయిర్‌విజ్‌ ప్రైమ్‌, ఎయిర్‌విజ్‌ ప్లస్‌, ఎయిర్‌విజ్‌ ఎన్‌లను ఆవిష్కరించింది. వేరియంట్‌ను అనుసరించి ప్రత్యేక ఫీచర్లు ఉన్నట్లు చెప్పింది. వీటిని వీ-గార్డ్స్ రూర్కీ ఫెసిలిటీలో రూపొందిస్తున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: రూ.19,500 విలువైన సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం!

ఈ సందర్భంగా వీ-గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మిథున్ చిట్టిలపల్లి మాట్లాడుతూ..‘ఎయిర్ విజ్ బీఎల్‌డీసీ(బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్-ఏసీ మోటార్లను ఉపయోగించే సంప్రదాయ ఫ్యాన్‌ల మాదిరిగా కాకుండా, బీఎల్‌డీసీ ఫ్యాన్‌లు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ద్వారా నియంత్రించబడే శాశ్వత మాగ్నెట్ మోటార్‌ను ఉపయోగిస్తాయి) ఫ్యాన్‌ను ఆవిష్కరించడం సంస్థ ప్రయాణంలో కీలక మైలురాయిని సూచిస్తుంది. వృద్ధి, ఇన్నోవేషన్‌పరంగా ఫ్యాన్ కేటగిరీ మా వ్యాపారానికి చాలా ముఖ్యం. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా బీఎల్‌డీసీ సాంకేతికత చాలా అవసరం’ అన్నారు.

#

Tags : 1

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు