Breaking News

ఆరేళ్లలో వేకా రూ. 100 కోట్ల పెట్టుబడులు 

Published on Sat, 02/15/2025 - 05:49

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: తలుపులు, కిటికీలకి సంబంధించిన యూపీవీసీ ప్రొఫైల్స్‌ తయారీ సంస్థ వేకా వచ్చే ఆరేళ్లలో కార్యకలాపాల విస్తరణపై రూ. 100 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది రూ. 16 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఎన్‌సీఎల్‌–వేకాలో 100 శాతం వాటాలను కొనుగోలు చేసి కంపెనీని టేకోవర్‌ చేసిన సందర్భంగా వేకా ఏజీ జర్మనీ సీఈవో ఆండ్రియాస్‌ హార్ట్‌లీఫ్‌ ఈ విషయాలు తెలిపారు. 

జేవీలో వేకాకు గతంలో 50 శాతం వాటాలు ఉండగా, తాజాగా ఎన్‌సీఎల్‌ నుంచి మరో 50 శాతాన్ని కొనుగోలు చేసింది. టేకోవర్‌తో ప్రస్తుతం ఎన్‌సీఎల్‌ వేకా చైర్మన్‌గా ఉన్న అశ్విన్‌ దాట్ల ఇకపై డైరెక్టరుగా కొనసాగనుండగా, ఎండీగా యూఎస్‌ మూర్తి కొనసాగుతారు. ప్రణాళికల్లో భాగంగా వేకా ప్రధానంగా ఎక్స్‌ట్రూషన్‌పైన, ఎన్‌సీఎల్‌.. ఫ్యాబ్రికేషన్‌పైనా దృష్టి పెట్టనున్నట్లు ఈ సందర్భంగా అశ్విన్‌ వివరించారు. కంపెనీకి ప్రస్తుతం హైదరాబాద్‌లో 28 లైన్లతో ఒక ఎక్స్‌ట్రూషన్‌ ప్లాంటు, బెంగళూరులో ఫ్యాబ్రికేషన్‌ ప్లాంటు ఉన్నట్లు చెప్పారు. కంపెనీ గతేడాది రూ. 442 కోట్ల ఆదాయం ఆర్జించగా, 15 శాతం వార్షిక వృద్ధి అంచనా వేస్తున్నట్లు మూర్తి తెలిపారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)