Breaking News

వాహన స్క్రాపేజీ పాలసీ: కంపెనీలకు నితిన్‌ గడ్కరీ కీలక సూచనలు

Published on Wed, 09/27/2023 - 10:30

న్యూఢిల్లీ: కాలం చెల్లిన పాత వాహనాలను తుక్కుగా మార్చే (వాహన స్క్రాపేజీ) విధానానికి మద్దుతగా నిలవాలని ఆటోమొబైల్‌ పరిశ్రమ, భాగస్వాములు అందరికీ కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ పిలుపునిచ్చారు. ఇది అందరి విజయానికి దారితీసే విధానమని పేర్కొన్నారు. పరిశ్రమ భాగస్వాములతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. 15-20 ఏళ్ల జీవిత కాలం ముగిసిన వాహనాలను తొలగించి, కొత్త వాటి కొనుగోలును ప్రోత్సహించడమే ఈ విధానం లక్ష్యమని తెలిపారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన రహదారుల నిర్మాణం, వాహనాల విద్యుదీకరణ, వాహనాల ఫిట్‌నెస్‌ టెస్టింగ్‌ను తప్పనిసరి చేయడం తదితర చర్యలతో వాహనాలకు స్థిరమైన బలమైన డిమాండ్‌ను నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్టు గడ్కరీ పేర్కొన్నారు.

ఆటోమొబైల్‌ ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీదారులు (ఓఈఎంలు) తయారీని పెంచుకోవడం ద్వారా ప్రపంచంలో అతిపెద్ద ఆటోపరిశ్రమగా అవతరించేందుకు కృషి చేయాలని కోరారు. వాహన స్కాప్రేజీతో పరిశ్రమే ఎక్కువ ప్రయోజనం పొందుతుందని గుర్తు చేశారు. కనుక మూడు స్తంభాలను నిర్మించేందుకు పరిశ్రమ ముందుకు రావాలన్నారు. ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ కేంద్రాలు, వాహన తుక్కు కేంద్రాల ఏర్పాటుపై పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమను కోరారు. నూతన విధానంతో కలిగే ప్రయోజనాలపై పౌరుల్లో అవగాహన పెంచేందుకు తమ డీలర్‌ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. వాహనాన్ని తుక్కుగా మార్చుకునేందుకు ముందుకు వచ్చే వినియోగదారులకు డిస్కౌంట్‌ ఇవ్వాలని కోరారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)