Breaking News

రుణ చెల్లింపులకు రెడీ: వేదాంతా

Published on Thu, 03/02/2023 - 04:38

న్యూఢిల్లీ: రానున్న త్రైమాసికాలలో రుణ చెల్లింపులను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు డైవర్సిఫైడ్‌ గ్రూప్‌ వేదాంతా రీసోర్సెస్‌ తాజాగా స్పష్టం చేసింది. మైనింగ్, మెటల్, చమురు, గ్యాస్‌ రంగాలలో కార్యకలాపాలు విస్తరించిన గ్రూప్‌ ఆర్థిక పరిస్థితిపై ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని పాదుకొల్పే బాటలో 175 కోట్ల డాలర్ల రుణాలను పొందనున్నట్లు తెలియజేసింది. బ్యాంకుల నుంచి సిండికేట్, బైలేటరల్‌ రుణాలను అందుకునే సన్నాహాలు చివరి దశలో ఉన్నట్లు వెల్లడించింది. 2023 మార్చివరకూ అన్ని రుణాలనూ ముందస్తుగా చెల్లించినట్లు తెలియజేసింది.

ఈ బాటలో 11 నెలల్లో 200 కోట్ల డాలర్ల రుణ భారాన్ని తగ్గించుకున్నట్లు పేర్కొంది. రాను న్న ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో అవసరమైన లిక్విడిటీని సమకూర్చుకోగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. హిందుస్తాన్‌ జింక్‌(హెచ్‌జెడ్‌ఎల్‌)లో 6.8% వాటా మినహా ఎలాంటి తనఖాలూ లేవని వెల్లడించింది. అంతర్జాతీయ జింక్‌ ఆస్తుల విక్రయం లేదా 200 కోట్ల డాలర్ల నిధులను సమకూర్చుకోకుంటే వేదాంతా క్రెడిట్‌ రేటింగ్స్‌ ఒత్తిడిలో పడే వీలున్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ఫిబ్రవరి నెల మొదట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేదాంతా తాజా వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)