Breaking News

వేదాంతా లాభం హైజంప్‌

Published on Thu, 05/01/2025 - 15:35

డైవర్సిఫైడ్‌ దిగ్గజం వేదాంతా గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 154 శాతం దూసుకెళ్లి రూ. 3,483 కోట్లను తాకింది. ఉత్పత్తి వ్యయాలు తగ్గడం, అమ్మకాల పరిమాణం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 1,369 కోట్లు ఆర్జించింది.

మొత్తం ఆదాయం సైతం రూ. 36,093 కోట్ల నుంచి రూ. 41,216 కోట్లకు జంప్‌ చేసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి వేదాంతా నికర లాభం భారీ వృద్ధితో రూ. 14,988 కోట్లకు చేరింది. 2023–24లో కేవలం రూ. 4,239 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 1,46,988 కోట్ల నుంచి రూ. 1,56,643 కోట్లకు ఎగసింది.

2025 మార్చి 31 కల్లా స్థూల రుణ భారం రూ. 73,853 కోట్లుగా నమోదైంది. మరోసారి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా అరుణ్‌ మిశ్రాను బోర్డు ఎంపిక చేసినట్లు వేదాంతా పేర్కొంది. వివిధ బిజినెస్‌లను ప్రత్యేక కంపెనీలుగా విడదీసే ప్రణాళికలను సెప్టెంబర్‌ చివరికల్లా పూర్తిచేయనున్నట్లు వేదాంతా సీఎఫ్‌వో అజయ్‌ గోయెల్‌ తాజాగా వెల్లడించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)