Breaking News

ఆ ఏనుగుకు అక్కడే అన్ని సౌకర్యాలూ కల్పిస్తాం: వంతారా

Published on Wed, 08/06/2025 - 17:00

అనంత్ అంబానీ నిర్వహిస్తున్న వన్యప్రాణి సంరక్షణ, పునరావాస కేంద్రం వంతారాలో సంరక్షిస్తున్న మాధురి అనే ఏనుగును తిరిగి కొల్హాపూర్‌కు తరలించే ప్రయత్నాలకు తాము పూర్తిగా సహకరిస్తామని గుజరాత్‌ని జంతు సంరక్షణ కేంద్రం వంతారా తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకే ఆ ఏనుగును వంతారాకు తీసుకొచ్చామని, ఇందులో తమ ప్రమేయమేమీ లేదని వంతారా మరోసారి స్పష్టం చేసింది.

పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) పిటిషన్ ఆధారంగా బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు గత నెలలో మాధురి ఏనుగును కొల్హాపూర్ లోని నందిని మఠం నుంచి జామ్ నగర్ లోని వంతరా కేంద్రానికి తరలించారు. స్థానికులు మాధురి ఏనుగును పవిత్రంగా భావించే కొల్హాపూర్ లో ఈ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తాయి.  అనంతరం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా  సమర్థించింది. దీంతో ఈ అంశంపై  మహారాష్ట్ర ప్రభుత్వం మరోసారి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా  చెప్పారు. దీనిపై స్పందించిన వంతరా ఒక ప్రకటన విడుదల చేసింది.

మాధురిని కొల్హాపూర్ కు తిరిగి రప్పించాలని కోరుతూ జైన మఠం, మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వంతరా పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపింది. సుప్రీం  కోర్టు అనుమతికి లోబడి మాధురి ఏనుగును సురక్షితంగా, గౌరవప్రదంగా తిరిగి కొల్హాపూర్‌కు తరలించడానికి పూర్తి సాంకేతిక,  పశువైద్య సహాయాన్ని అందిస్తుందని పేర్కొంది.  అంతేకాకుండా దీర్ఘకాలిక పరిష్కారంగా కొల్హాపూర్ లో మాధురి కోసం శాటిలైట్ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటును వంతరా ప్రతిపాదించింది. మఠం, మహారాష్ట్ర ప్రభుత్వం, జంతు సంక్షేమ నిపుణుల సహకారంతో ఈ కొత్త సదుపాయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. మఠం అధిపతి, రాష్ట్ర అధికారులతో చర్చించి భూమిని ఎంపిక చేస్తామని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు తమ బృందం సిద్ధంగా ఉందని వంతరా తెలిసింది.

ప్రతిపాదిత కేంద్రంలో  కల్పించే సౌకర్యాలు

  • హైడ్రోథెరపీ పాండ్‌, స్విమ్మింగ్ ప్రాంతం

  • లేజర్ థెరపీ గదులు, పునరావాస ప్రదేశాలు

  • నైట్ షెల్టర్, గొలుసులు లేని భారీ బయలు ప్రదేశం

  • సహజ ప్రవర్తన, ఆట కోసం ఇసుక గుంట

  • 24/ 7 సంరక్షణ కోసం పూర్తిస్థాయి సౌకర్యాలతో  పశువైద్యశాల

  • కీళ్ల నొప్పులు,పాదాల కుళ్లడం వంటి వాటి నుంచి ఉపశమనం, విశ్రాంతి కోసం మృదువైన రబ్బరు ఫ్లోర్లు, ఇసుక దిబ్బలు

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)