వందే భారత్ లోకో పైలట్ జీతం ఎంతో తెలుసా?

Published on Sat, 08/01/2026 - 16:46

వందే భారత్ రైళ్లు భారతదేశం అంతటా విస్తరిస్తున్న తరుణంలో.. వీటిని నడిపే వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. వందే భారత్ లోకో పైలట్‌లను ఎలా నియమిస్తారు?, ఎలాంటి అర్హతలు కావలి?, జీతం ఎంత? అనే వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

వందే భారత్ ట్రైన్స్ కోసం.. భారతీయ రైల్వే లోకో పైలట్లను నేరుగా నియమించదు. అభ్యర్థులు ముందుగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)గా చేరి, కొన్ని సంవత్సరాల అనుభవం సంపాదించాలి. ఆ తర్వాత ప్రత్యేక శిక్షణ పొందిన తర్వాతే వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లను నడిపే అవకాశం కల్పిస్తారు.

అర్హతలు
అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే అభ్యర్థి కనీసం పదో తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. అంతేకాకుండా.. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి. వయస్సు సాధారణంగా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రైల్వే నిర్దేశించిన వైద్య పరీక్షలు, ముఖ్యంగా కంటి చూపు పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి.

జీతం
ఉద్యోగంలో చేరిన తర్వాత అసిస్టెంట్ లోకో పైలట్‌కు ప్రాథమిక వేతనం రూ.19,900 ఉంటుంది. అలవెన్సులతో కలిపి, వారి నెలసరి చేతికి అందే జీతం సాధారణంగా రూ.35,000 నుంచి రూ.40,000 మధ్య ఉంటుంది. అనుభవం పెరిగి వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లను నడిపే స్థాయికి చేరుకున్న తర్వాత నెలకు రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం సీనియారిటీ, పని గంటలు, రన్నింగ్ అలవెన్స్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

జీతంతో పాటు లోకో పైలట్లకు అనేక సౌకర్యాలు కూడా లభిస్తాయి. ఇందులో డియర్‌నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, రన్నింగ్ అలవెన్స్, నైట్ డ్యూటీ అలవెన్స్, ఉచిత వైద్య సేవలు, పెన్షన్, రైల్వే ప్రయాణ రాయితీలు, పెయిడ్ లీవ్స్, ఉద్యోగ భద్రత, పదోన్నతి అవకాశాలు వంటి ప్రయోజనాలు మొదలైనవి ఉన్నాయి.

ఇదీ చదవండి: వీసా కోసం రూ.19 లక్షల బాండ్.. జాబితాలో 50 దేశాలు!

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)