Breaking News

రైలు టికెట్‌ ఇలా కొంటే క్యాష్‌బ్యాక్‌..

Published on Wed, 02/26/2025 - 15:21

సాక్షి, సిటీబ్యూరో: సాధారణ టికెట్ల (Train ticket) కోసం ప్రవేశపెట్టిన అన్‌ రిజర్వ్‌డ్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ (UTS) మొబైల్‌ యాప్‌ ద్వారా టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు 3 శాతం క్యాష్‌బ్యాక్‌ (Cashback) రాయితీ ఇవ్వనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ తెలిపారు. 2016లో హైదరాబాద్‌ నగరంలోని ఎంఎంటీఎస్‌ ప్రయాణికుల కోసం మొదటిసారి యూటీఎస్‌ను ప్రవేశపెట్టారు.

ఆ తరువాత 2018 జూలై నుంచి అన్ని రైళ్లలో సాధారణ టికెట్‌ కొనుగోళ్లకు దీన్ని విస్తరించారు. ప్లాట్‌ఫామ్‌ టికెట్‌లు, సీజన్‌ టికెట్లు కూడా యూటీఎస్‌ ఆర్‌–వాలెట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికులు ఆర్‌–వాలెట్‌తోపాటు, పేటీఎం, ఫోన్‌ పే, గూగుల్‌ పే, యూపీఐ యాప్‌లు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా డిజిటల్‌ చెల్లింపులు చేయవచ్చు.

ఆర్‌–వాలెట్‌లో రూ.20 వేల వరకు డిపాజిట్‌ చేసే సదుపాయం ఉంది. యూటీఎస్‌ యాప్‌ ద్వారా టికెట్‌ కొనుగోళ్లను ప్రోత్సహించడానికే ఈ క్యాష్‌బ్యాక్‌ సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం సగటున ప్రతిరోజు సుమారు 83,510 మంది యూటీఎస్‌ను వినియోగించుకోగా, ఈ ఏడాది ఆ సంఖ్య రోజుకు 93,487కు పెరిగింది.

ఏడాది కాలంలో 12 శాతం పెరిగినట్లు సీపీఆర్వో తెలిపారు. టికెట్‌ కౌంటర్‌ల వద్ద పడిగాపులు కాయవలసిన అవసరం లేకుండా అప్పటికప్పుడు యాప్‌ ద్వారా కొనుగోలు చేసుకొని బయలుదేరవచ్చు. దీని వల్ల ప్రయాణికులకు సమయం ఆదా కావడమే కాకుండా క్యాష్‌ బ్యాక్‌ ప్రయోజనాన్ని కూడా పొందే ఆస్కారం ఉంటుంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)