Breaking News

యూజ్డ్‌ ఐటీ హార్డ్‌వేర్‌.. నిబంధనల్లో మార్పులివే..

Published on Wed, 01/03/2024 - 08:49

న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని (సెజ్‌) యూనిట్లు ఉపయోగించిన ఐటీ హార్డ్‌వేర్‌ ఉత్పత్తులను (ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మానిటర్లు, ప్రింటర్లు) బైటికి తరలించడానికి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం సడలించింది. దేశీ టారిఫ్‌ ఏరియాల్లో (డీటీఏ) తాము సొంతంగా వినియోగించుకోవడానికి మాత్రమే లైసెన్సు అవసరం లేకుండా కంపెనీలు వాటిని సెజ్‌ల నుంచి తరలించవచ్చని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.

అయితే, ఆ పరికరాలను సెజ్‌ యూనిట్లలో కనీసం రెండేళ్ల పాటు ఉపయోగించి ఉండాలి. అయిదేళ్ల కన్నా పాతవై (తయారీ తేదీ నుంచి) ఉండకూడదు. దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం స్వల్పంగా సడలించిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

సాధారణంగా దేశీ మార్కెట్లోని సంస్థలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, కస్టమ్స్‌ చట్టాలపరంగా సెజ్‌లను విదేశీ భూభాగంగా పరిగణించడం వల్ల వాటిలోని యూనిట్లకు సుంకాలపరమైన మినహాయింపులు ఉంటాయి. కానీ, సెజ్‌లలోని సంస్థలు తమ ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాల్లోకి తీసుకువస్తే .. వాటిని దిగుమతులుగా పరిగణిస్తారు. తదనుగుణంగా సుంకాలూ వర్తిస్తాయి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)