Breaking News

వాన పడితే వావ్‌! ఈ గ్యాడ్జెట్స్‌ ఉంటే రెయిన్‌ టెన్షన్‌ ఉండదిక..

Published on Sun, 07/27/2025 - 17:47

వాన పడితే చాయ్, పకోడీతో ‘వావ్‌’ అనాలా? లేదా తడి బట్టల టెన్షన్‌తో ‘ఓహ్‌ నో!’ అనాలా?. ఇప్పుడు వావ్‌ మాత్రమే అనిపించేలా, వాన తెచ్చే టెన్షన్‌కి బై.. బై చెప్పే గాడ్జెట్స్‌ వచ్చేశాయి. అవే ఇవి.

ఇంట్లోనే ఆరేసేయ్‌!
ఇంట్లో బట్టలు ఆరేయడానికి చోటు లేదు, బయట గాలి లేదు, లాండ్రీకి వేసేందుకు టైమ్‌ లేదు.. ఇలా వానాకాలంలో బట్టలు అన్నవే బాధగా మారిపోయాయా? కూల్‌! ఇప్పుడు మార్కెట్లోకి చిటికెలోనే దుస్తులను ఆరబెట్టే అద్భుతమైన పరికరం వచ్చేసింది. పేరు ‘ఎక్స్‌ప్రెస్‌ డ్రైయర్‌ ఔరేట్‌ ప్రో మ్యాక్స్‌’. చిన్న బాటిల్‌ సైజులో ఉండే ఈ పరికరం, ఒకేసారి నాలుగు పెద్ద దుస్తులను ఆరబెట్టగలదు. అంతేకాదు, దీనిని ఆన్‌ చేసుకుంటే, ఇందులోంచి వెలువడే అల్ట్రావయొలెట్‌ కాంతి దుస్తులపై ఉండే సూక్ష్మజీవులను నిర్మూలిస్తుంది. దీని వల్ల దుస్తుల మురుగు వాసన తొలగి, అచ్చం బయట ఎండలో ఆరవేసినంత శుభ్రంగా తయారవుతాయి. పవర్‌ ఆన్‌చేసి, ఒక్కసారి టైమర్‌ పెడితే, పని అయిపోగానే ఆదే ఆగిపోతుంది. ఈ డ్రైయర్‌ను మడతపెట్టి సూట్‌కేస్‌లో పెట్టుకోవచ్చు కూడా. దీని ధర రూ. 4,712.

కవర్‌ వేసి కూల్‌గా నడవండి 
వర్షం రాగానే చాలామంది హెల్మెట్, గొడుగు, రెయిన్‌ కోట్‌ వేసుకొని ఫుల్‌ ప్రొటెక్షన్‌ మోడ్‌లోకి వెళ్తారు. ముఖం తడవదు, జుట్టు తడవదు కాని, చెప్పులు? కొత్తగా కొన్న బ్రాండెడ్‌ షూస్‌ బురదలో మునిగి, మురికి నీళ్లలో నానిపోయి, ఇంట్లోకి అడుగు పెట్టే సరికి వాసనతో బరువెక్కిపోతుంటాయి. ఇప్పుడు ఆ బాధకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు మార్కెట్‌లోకి వచ్చాయి వాటర్‌ప్రూఫ్‌ షూ కవర్స్‌. పీవీసీ మెటీరియల్‌తో తయారైన ఇవి జిప్పర్, డ్రాస్ట్రింగ్‌ డిజైన్‌లతో షూస్‌కి నాలుగు వైపులా కవచంలా ఉంటాయి. వర్షం, మంచు, మట్టి, బురద నుంచి రక్షణ ఇస్తాయి. నాన్‌స్లిప్‌ సోల్‌ వల్ల వీటితో నడిచేటప్పుడు జారిపోయే ప్రమాదం ఉండదు. వీటిని మడతపెట్టి పాకెట్‌లో వేసుకోవచ్చు. ధర వివిధ  కంపెనీలను బట్టి రూ. 200 నుంచి రూ. 1000 వరకు ఉంటుంది.

సురక్షితమైన వెలుగు సువాసనతో
వర్షం వచ్చినప్పుడల్లా పవర్‌ కట్‌ కామన్‌! టీవీ ఆగిపోతుంది, ఫ్యాన్‌ ఆగిపోతుంది, ఇల్లంతా చీకటి కమ్మేస్తుంది. అప్పుడు మనం క్యాండిల్స్‌ వెలిగిస్తాం. అది మామూలు క్యాండిల్‌ అయితే, చేతుల మీద కరిగిన మైనం పడి మండుతుంది. గాజు జార్‌లో ఉన్న క్యాండిల్‌ చీకట్లో పగిలిపోతుంది. అందుకే, ఇలాంటి సమయాల్లో నిజంగా పనికొచ్చేవి మామూలు క్యాండిల్స్‌ కాదు, ‘సాండ్‌ వాక్స్‌ క్యాండిల్స్‌’. ఈ క్యాండిల్‌ వాక్స్‌ మామూలు వాక్స్‌ కాదు. సువాసనతో కూడిన పౌడర్‌ వాక్స్‌. ఇది రీఫిల్లబుల్, నాన్‌ టాక్సిక్‌. చేతులపై కరిగి పడదు, పొగతో చికాకు పెట్టదు. మీకు ఇష్టమైన గిన్నెలో వేసుకుని, అందులో ఒత్తి పెట్టి వెలిగించుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లయినా ఒత్తి తీసి మళ్లీ వాడుకోవచ్చు. ధర. రూ.309 మాత్రమే!

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)