Breaking News

మైనస్‌లోకి అమెరికా జీడీపీ 

Published on Fri, 06/27/2025 - 05:59

వాషింగ్టన్‌: అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో (జనవరి–మార్చి/క్యూ1) అంచనాలకు మించి క్షీణతను చవిచూసింది. ట్రంప్‌ గందరగోళ వాణిజ్య విధానాలతో వ్యాపారపరమైన అనిశి్చతులకుతోడు బలహీన వినియోగ డిమాండ్‌ ప్రభావం చూపించాయి. జీడీపీ మైనస్‌ 0.5 శాతానికి పడిపోయినట్టు అమెరికా వాణిజ్య శాఖ తన మూడవ, తుది అంచనాలను ప్రకటించింది. ద్వితీయ అంచనాల్లో క్షీణత 0.2 శాతంగానే ఉండొచ్చన్న వాణిజ్య శాఖ అంచనాలను మించి ఆర్థిక వ్యవస్థ కుంగుబాటునకు గురైంది. మూడేళ్లలోనే మొదటిసారి అమెరికా జీడీపీ మైనస్‌లోకి వెళ్లినట్టయింది. 

ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండే కీలకమైన వినియోగదారుల వ్యయం నిదానించినట్టు తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. మార్చి త్రైమాసికంలో వినియోగం 1.2 శాతంగా ఉంటుందని అంచనా వేయగా, ఇది 0.5 శాతానికి పరిమితమైంది. 2024 చివరి త్రైమాసికంలోనూ వినియోగం 4 శాతం వృద్ధిని చూసింది. నాలుగేళ్లలోనే ఒక త్రైమాసికం పరంగా ఇది అతి తక్కువ వినియోగం కావడం గమనార్హం. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడానికి ట్రంప్‌ టారిఫ్‌లు సైతం ప్రభావం చూపించాయి. టారిఫ్‌లు అమల్లోకి రావడానికి ముందే పెద్ద మొత్తంలో దిగుమతులకు అక్కడి సంస్థలు మొగ్గు చూపించాయి.  2024 చివరి త్రైమాసికంలో అమెరికా జీడీపీ 2.4 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)