Breaking News

సుంకాల పెంపులోనూ ఎన్నో అవకాశాలు

Published on Sat, 04/05/2025 - 08:12

అమెరికా విధించిన సుంకాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని విభిన్న సెక్టార్లలో ఆందోళనలు కలిగిస్తున్నాయి. అయితే భారతీయ తోలు(లెదర్‌) పరిశ్రమ యూఎస్‌కు తన ఎగుమతులను విస్తరించడానికి ఈ సుంకాలు ఎంతో అవకాశాన్ని కల్పించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్య కాలంలో భారత్ 870 మిలియన్ డాలర్ల(సుమారు రూ.7,221 కోట్లు) విలువైన తోలు, తోలు ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. ఇండియన్‌ లెదర్‌ వస్తువులకు అమెరికాలో ఉన్న మార్కెట్‌ను ఈ గణాంకాలు హైలైట్ చేస్తున్నాయి.

ఈ విభాగంలో భారత్‌కు పోటీగా ఉన్న వియత్నాం, చైనా, కంబోడియా వంటి దేశాలపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడం ఈ అవకాశాన్ని ప్రేరేపించే ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంది. భారత్‌పైనా యూఎస్‌ సుంకాలు ఉన్నప్పటికీ ఇక్కడి ఎగుమతులపై విధించిన సుంకాల కంటే కనీసం 20% అధిక సుంకాలను ఆయా దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఇది భారతీయ ఎగుమతిదారులకు కలిసొచ్చే అంశంగా మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇది కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, యూఎస్ మార్కెట్‌లో వారి పట్టును బలోపేతం చేయడానికి వీలు కల్పిస్తుంది.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్స్ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఐఈఓ) మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌, ఫరీదా గ్రూపు ఉన్నతాధికారి ఇస్రార్ అహ్మద్ మాట్టాడుతూ.. ‘తోలు పరిశ్రమ వర్గాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భారతీయ ఎగుమతిదారులు తమ ఉత్పత్తుల్లో సామర్థ్యాన్ని మెరుగుపరచడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడంపై దృష్టి సారించాలి. తమ మార్కెట్‌ పరిధిని వైవిధ్యపరచుకోవడంపై ఆసక్తిగా ఉండాలి’ అన్నారు.

ఇదీ చదవండి: రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చు?

పరిమిత సమయమే..?

పోటీ దేశాలు అమెరికా సుంకాలు విధించినంత మాత్రాన నిమ్మకుండిపోకుండా ఆ దేశంతో చర్చలు జరిపి తమ రేట్లను తగ్గించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాంతో వృద్ధిని కొనసాగించడానికి ఈ టారిఫ్ ప్రయోజనం ఆరు నుంచి తొమ్మిది నెలలకు మించకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. భారతీయ తోలు పరిశ్రమ దాని బలమైన సరఫరా గొలుసును ఆసరాగా చేసుకుని నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తితో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయాలని చెబుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)