Breaking News

అదానీపై ఫిర్యాదుకు ప్రభుత్వ సాయం కోరిన ఎస్‌ఈసీ

Published on Wed, 02/19/2025 - 14:16

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై ఫిర్యాదు చేసేందుకు భారత ప్రభుత్వం సాయం కోరుతూ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (యూఎస్ ఎస్ఈసీ) సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న అదానీలకు తమ ఫిర్యాదును అందించేందుకు కృషి చేస్తున్నట్లు అమెరికా ఎస్ఈసీ న్యూయార్క్ జిల్లా కోర్టుకు తెలిపింది. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు భారత న్యాయ మంత్రిత్వ శాఖ సాయాన్ని కోరినట్లు ఎస్ఈసీ పేర్కొంది. అయితే అందుకు మోదీ ప్రభుత్వం ఒప్పుకుంటుందా? అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ తన ఎక్స్‌లో అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మోయిత్రా స్పందిస్తూ అదానీతో ఉన్న ‘పర్సనల్ మామ్లా(వ్యక్తిగత సంబంధం)’కు మోదీ కట్టుబడి ఉంటారో.. లేదో.. తెలియాలని కామెంట్‌ చేశారు.

అసలేం జరిగిందంటే..

అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు చెల్లించిందన్న ఆరోపణలున్నాయి. దాంతో అమెరికాలోని పెట్టుబడిదారులు కూడా ఏజీఈఎల్‌లో ఇన్వెస్ట్‌ చేయడంతో కంపెనీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి యూఎస్‌లోని ఎస్‌ఈసీ, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ ప్రాథమిక దర్యాప్తు జరిపి సివిల్, క్రిమినల్ కేసులు పెట్టింది. వాటిని ఎదుర్కొనేందుకు అదానీ గ్రూప్‌ గతంలో రెండు సంస్థలను కూడా నియమించింది.

కేసు నేపథ్యం

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుంచి కాంట్రాక్టులు పొందడానికి ఏజీఈఎల్‌కు అనైతికంగా సాయపడటానికి భారత అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ, ఇతర ఎగ్జిక్యూటివ్‌లపై 2024 నవంబర్ 21న అమెరికా అధికారులు అభియోగాలు మోపారు. ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వినీత్ ఎస్ జైన్‌లపై యూఎస్ ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఏఫ్‌సీపీఏ) ఉల్లంఘనలకు సంబంధించి అభియోగాలు మోపలేదని ఎజీఈఎల్ నొక్కి చెప్పింది.

ఇదీ చదవండి: ‘గ్రోక్ 3’ను ఆవిష్కరించిన మస్క్‌

అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అవి ‘నిరాధారమైనవి’ అని కొట్టిపారేసింది. దాంతోపాటు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు సాధ్యమైన అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తామని చెప్పింది. ఎస్ఈసీ అభ్యర్థనపై భారత ప్రభుత్వం ఇంకా ఏ విధంగానూ స్పందించలేదు. ప్రభుత్వం అదానీలకు ఫిర్యాదును అందించడానికి అంగీకరిస్తుందో.. లేదో చూడాలి.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)