Breaking News

అమెరికా మార్కెట్లు క్రాష్‌: కారణం ఇదే..

Published on Tue, 03/11/2025 - 06:53

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెరతీసిన టారిఫ్‌ వార్‌ ఆర్థిక అనిశ్చితులకు దారి తీయోచ్చనే ఆందోళనలతో సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. నాస్‌డాక్‌ 4%, ఎస్‌అండ్‌పీ 2.5%, డోజోన్స్‌ 1.3% నష్టాలతో ట్రేడయ్యాయి.

టెక్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నాస్‌డాక్‌ ఇండెక్స్‌లోని ప్రధాన షేర్లైన ఆల్ఫాబెట్, అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్‌విడియా, టెస్లా షేర్లు 2–14% కుప్పకూలాయి.

ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నవంబర్‌లో టెస్లా షేరు ఆర్జించిన లాభాలన్నీ(50%) తుడిచిపెట్టుకుపోయాయి. టారిఫ్‌ల కారణంగా ధరలు పెరుగుతాయనే ఆందోళనలను ట్రంప్‌ తోసిపుచ్చారు. అయితే ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలను మాత్రం తోసిపుచ్చలేదు.

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

రూపాయి 36 పైసలు డౌన్‌
రూపాయి విలువ నెలరోజుల్లో అతిపెద్ద పతనం చవిచూసింది. డాలర్‌ మారకంలో సోమవారం 36 పైసలు క్షీణించి 87.31 వద్ద స్థిరపడింది. ఫిబ్రవరి 5 తర్వాత ఒక రోజులో రూపాయికిదే భారీ నష్టం. క్రూడాయిల్‌ ధరల్లో ఒడిదుడుకులు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయని నిపుణులు తెలిపారు. 

ఇదీ చదవండి: గుట్టు విప్పిన ఐటీ శాఖ: అలాంటి వారికి ట్యాక్స్ నోటీసులు?

#

Tags : 1

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు