Breaking News

అదృష్టమంటే ఇదే.. ఒకేసారి రెండు లాటరీలు.. ఊహించనంత డబ్బు!

Published on Fri, 04/11/2025 - 12:15

ఎవరికైనా జీవితంలో ఒకసారి లాటరీ తగిలితేనే వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెబుతారు. అలాంటిది ఒకేసారి రెండు లాటరీలు తగిలితే.. వాళ్ళను ఏమనాలి. ఇలాంటి ఘటన ఎక్కడైనా జరుగుతుందా అని మీరు అనుకోవచ్చు. కానీ అమెరికాలోని నార్త్ కరోలినాలో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

నార్త్ కరోలినాలోని ఒక వ్యక్తి అప్పటికే గెలుపొందిన లాటరీ బహుమతి రూ. 40 లక్షలు క్లెయిమ్ చేసుకోవడానికి.. గ్రీన్స్‌బోరో రీజినల్ ఆఫీస్ & క్లెయిమ్ సెంటర్‌కు వచ్చాడు. ఆ సమయంలో తన కుమార్తె.. అతని పుట్టినరోజును గుర్తుగా ఒక కెనో టికెట్ కొనుగోలు చేసింది. లాటరీలో ఆ టికెట్టుకు సుమారు రూ. 86 లక్షలు వచ్చాయి. ఇలా ఒకేరోజు రెండు లాటరీలు తగిలాయి. ఊహకందని డబ్బు చేతికి రావడంతో ఆ వ్యక్తి, అతని కుటుంబం సంతోషంలో మునిగిపోయింది.

ఒక అమెరికన్ వ్యక్తి లాటరీలో భారీ మొత్తంలో డబ్బు గెలుచుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఫిబ్రవరిలో కూడా నార్త్ కరోలినాలోని స్టాన్లీకి చెందిన విజేత రాబర్ట్ హోబన్ అనే వ్యక్తి లాటరీ టికెట్ ద్వారా రూ. 95 లక్షల కంటే ఎక్కువ గెలుచుకున్నాడు. ఇతడు లాటరీ టికెట్ కొనుగోలు చేసిన తరువాత, ఆ రాత్రి లాటరీ గెలుచుకున్నట్లు కలగన్నాడు. ఆ కల ఉదయానికి నిజమైంది. కలలో చూసిన మొత్తానికి అతడు గెలుచుకున్నాడు.

గమనిక: లాటరీ టికెట్స్ పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి లాటరీ టికెట్స్ కొనుగోలు చేయాలంటే.. తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. పాఠకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. లేకుంటే మోసపోయే అవకాశం ఉంది.

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)