Breaking News

'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'

Published on Sat, 05/17/2025 - 19:50

భారతదేశంలోని యూఎస్ రాయబార కార్యాలయం.. అమెరికాలో ఉంటున్న భారతీయులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. నిర్దిష్ట గడువు దాటిన తరువాత కూడా అక్కడే (అమెరికాలో) ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

నిర్దిష్ట గడువు తరువాత కూడా అమెరికాలో ఉంటే.. వారిపై బహిష్కరణ వేటు ఉంటుంది. అంతే కాకుండా భవిష్యత్తులో మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టడానికి సాధ్యం కాదు, అంటే శాశ్వత నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని తన ఎక్స్ ఖాతాలో యూఎస్ ఎంబసీ ఇండియా వెల్లడించింది.

యూఎస్ ఎంబసీ ఇండియా చేసిన ప్రకటన.. అమెరికాలో విద్యార్థి, పర్యాటక, వర్క్ పర్మిట్ వంటి వీసాలతో ఉంటున్న భారతీయులకు వర్తిస్తుంది. ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా అక్కడే ఉంటే.. వారు భవిష్యత్తులో ఎప్పుడూ మళ్ళీ అమెరికాలో అడుగుపెట్టలేరు. నిర్దిష్ట గడువు తరువాత.. ఏవైనా అనుకోని ఇబ్బందులు ఎదురైతే, చట్టపరమైన చర్యల నుంచి బయటపడటానికి యూఎస్‌సీఐఎస్‌ (U.S. Citizenship and Immigration Services) ని సంప్రదించాలని, యూఎస్ ఎంబసీ ఇండియా పేర్కొంది.

ఇదీ చదవండి: ఇదీ పాకిస్తాన్‌ పరిస్థితి..!

వీసా గడువు ముగిసిన తరువాత కూడా దేశంలో ఉంటున్నవారు యూఎస్ విడిచి వెళ్లిపోవాలని.. హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ ఏప్రిల్‌లోనే చెప్పారు. గడువు దాటిన 30 రోజుల వరకు కూడా దేశంలోనే ఉన్నవారు ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. లేకుంటే.. అలాంటి వారిని క్రిమినల్ కేసులు కింద అరెస్ట్ చేసి జైలులో ఉంచే అవకాశం ఉంది. జరిమానా కూడా విధించవచ్చు.

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)