Breaking News

కడుపు నిండా తిండి పెట్టి.. ఉదయాన్నే చావు కబురు చల్లగా చెప్పిన ఐటీ సంస్థ!

Published on Fri, 05/05/2023 - 22:11

ఆర్ధిక మాంద్యం దెబ్బకు ప్రపంచ దేశాల్లోని ఆయా కంపెనీలు లేఆఫ్స్‌ ప్రకటిస్తున్నాయి. తొలగింపులపై ముందస్తు సమాచారం ఇస్తున్నాయి. కానీ కొన్ని సంస్థల లేఆఫ్స్‌ తీరుపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు పింక్‌ స్లిప్‌లను మెయిల్స్‌, మెసేజ్‌ల ద్వారా తెలుపుతాయి. కానీ ఈ సంస్థ అందుకు భిన్నంగా వ్యవహరించింది.  కడుపు నిండా తిండి పెట్టి, తాగినోళ్లకు తాగినంత మందు పోసి చావు కబురు చల్లగా చెప్పింది

అమెరికాలోని అరిజోనా కేంద్రంగా బిషప్‌ ఫాక్స్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే ఇటీవల అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లతో ప్రాజెక్ట్‌లు లేక.. సంస్థలో ఆర్ధిక అనిశ్చితి నెలకొంది. దీంతో ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. బిషప్‌ ఫాక్స్‌లో మొత్తం 400 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 

వారందరికి ఖరీదైన హోటల్‌లో పార్టీ ఇచ్చింది. కంపెనీ ఇచ్చిన పార్టీకి ఉద్యోగులు హాజరయ్యారు. కడుపు నిండా తిండి పెట్టి, తాగినోళ్లకు తాగినంత సైబర్‌ సూప్‌ పేరుతో కంపెనీ ఖరీదైన మద్యం సరఫరా చేసింది. పార్టీ అయిపోయింది. ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. తెల్లారేసరికి లేఆఫ్‌ అంటూ చావు కబురు చల్లగా చెప్పడంతో షాక్‌ తిన్నారు. ముందురోజు రాత్రి పార్టీని బాగా ఎంజాయ్‌ చేసిన ఉద్యోగులు తెల్లారి కంపెనీ ప్రకటన విని ఊహించలేకపోయామంటూ సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి👉దేశంలోని ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్‌.. డబుల్‌ శాలరీలను ఆఫర్‌ చేస్తున్న కంపెనీలు!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)