Breaking News

నాలుగు నిమిషాల మీటింగ్: ఉద్యోగం నుంచి తీసేశారు!

Published on Fri, 10/03/2025 - 15:02

కార్పొరేట్ ఉద్యోగాలు నీటిమీద బుడగలాగా మారిపోయాయి. ఎప్పుడు జాబ్ పోతుందో ఎవరూ ఊహించలేకపొతున్నారు. దీనికి కారణం కొన్ని కంపెనీల ప్రవర్తనే. ఇటీవల ఒక కంపెనీ నాలుగు నిముషాల మీటింగ్ తరువాత.. లేఆఫ్స్ అంటూ షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన రెడ్దిట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమెరికాకు చెందిన ఒక కంపెనీలో.. రిమోట్‌గా పనిచేస్తున్న ఒక భారతీయ ఉద్యోగి రెడ్డిట్‌లో తనకు ఎదురైన ఆకస్మిక & షాకింగ్ లేఆఫ్ అనుభవాన్ని పంచుకున్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. నేను ఉదయం 9 గంటలకు లాగిన్ అయ్యాను. 11 గంటలకు కంపెనీ సీఓఓ భారతదేశానికి చెందిన ఉద్యోగులతో మీటింగ్ స్టార్ట్ చేశారు. ఈ మీటింగ్ కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే సాగింది.

నాలుగు నిమిషాల మీటింగ్‌లోనే.. ఉద్యోగులను తొలగిస్తున్నట్లు, మీటింగ్ పూర్తైన తరువాత మెయిల్స్ అందుతాయని చెప్పాడు. తొలగింపులు పనితీరుకు సంబంధించినవి కాదని, అంతర్గత పునర్నిర్మాణ ప్రక్రియలో భాగమని ఆయన పేర్కొన్నారు. ఇది విన్న నేను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను.

ఇదీ చదవండి: అమెరికా వీడిన భారతీయ యువతి.. కన్నీటి వీడ్కోలు

ఉద్యోగులను ఎక్కువగా దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం ఏమిటంటే.. ముందస్తు సరైన సమాచారం లేకుండా ఉద్యోగులను తొలగించడం. అక్టోబర్ నెల పూర్తి జీతం నెలాఖరులోగా చెల్లిస్తామని, పెండింగ్‌లో ఉన్న సెలవులను నగదుగా మారుస్తామని కంపెనీ హామీ ఇచ్చిందని ఉద్యోగి పేర్కొన్నారు. నేను ఉద్యోగం కోల్పోవడం ఇదే మొదటిసారి, ఇది నిజంగా బాధాకరం వెల్లడించారు.

#

Tags : 1

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)