Breaking News

20వ అంతస్తు నుంచి దూకిన బిజినెస్‌ టైకూన్‌

Published on Fri, 07/19/2024 - 14:14

అమెరికా వ్యాపారవేత్త జేమ్స్ మైఖేల్ క్లైన్ ఎత్తైన భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 2000లో ఫాండాంగో మూవీ టికెటింగ్ వ్యాపారాన్ని ప్రారంభించిన ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ 64 ఏళ్ల జేమ్స్ మైఖేల్ క్లైన్ మంగళవారం ఉదయం మాన్‌హాటన్‌లోని కింబర్లీ హోటల్ 20వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక వార్తా నివేదిక పేర్కొంది.

న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకటన ప్రకారం.. పోలీసు అధికారులు ఉదయం 10:19 గంటలకు హోటల్‌కు చేరుకుని ఎత్తు నుంచి పడిపోయిన వ్యక్తిని గుర్తించి దర్యాప్తు చేపట్టారు. ఆయన గదిలో సూసైడ్ నోట్‌ లభించినట్లు తెలుస్తోంది. మైఖేల్ క్లైన్‌కు భార్య పమేలా బి క్లైన్, ఆరుగురు పిల్లలు ఉన్నారు.

ప్రస్తుతం ఎన్‌బీసీ యూనివర్సల్, వార్నర్ బ్రదర్స్ యాజమాన్యంలో ఉన్న ఫాండాంగోను 2011లో వీడిన తర్వాత, క్లైన్ తన అక్రెటివ్ కంపెనీ ద్వారా అక్యుమెన్, ఇన్సూరియన్, అకోలేడ్‌ లను స్థాపించారు. హెడ్జ్ ఫండ్ బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్‌తో సహా అనేక టెక్ కంపెనీలు, వెంచర్ క్యాపిటల్ వ్యాపారాలను కూడా క్లైన్‌ నిర్వహించారు. జక్స్‌టాపోస్‌కి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. జంతు సంరక్షణ న్యాయవాది అయిన ఆయన నేషనల్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ చైర్మన్‌గా కూడా పనిచేశారు.

#

Tags : 1

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)