భారత్‌కు అమెరికన్ కంపెనీ: రూ.3,250 కోట్ల పెట్టుబడి!

Published on Fri, 10/31/2025 - 16:50

అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ (Ford).. తమిళనాడులోని చెన్నై ప్లాంట్‌లో తయారీ కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి సిద్ధమైంది. దీనికోసం సంస్థ తమిళనాడు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది.

ఫోర్డ్ కంపెనీ మరైమలై నగర్ ప్లాంట్‌లో నెక్స్ట్ జనరేషన్ ఇంజిన్ తయారీకి కొత్త లైన్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది నాలుగు సంవత్సరాల విరామం తర్వాత.. భారతదేశంలో ఉత్పత్తికి పునరాగమనాన్ని సూచిస్తుంది. ఒప్పందం ప్రకారం.. ఫోర్డ్ సంస్థ ఈ ప్రాజెక్టు కోసం రూ.3,250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

ఫోర్డ్ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించిన తరువాత 600 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు, అనేక పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సంస్థకు చెందిన కొత్త సౌకర్యంలో సంవత్సరానికి 2,35,000 ఇంజిన్లను ఉత్పత్తి చేయనుంది. ఈ ఉత్పత్తి 2029లో ప్రారంభం కానుంది. కాగా ఇక్కడ ఉత్పత్తి చేసిన ఇంజిన్లను కంపెనీ.. ఎగుమతి చేయనుంది. కాబట్టి ఇవన్నీ గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా ఉంటాయి.

ఇదీ చదవండి: ఏడేళ్లుగా వెయిటింగ్.. నా డబ్బు రీఫండ్ చేయండి: శామ్ ఆల్ట్‌మాన్

2021లో ఫోర్డ్.. భారతదేశంలో వాహనాల తయారీని నిలిపివేసింది. దీనికి కారణం కంపెనీ ఊహకందని నష్టాలను చవిచూడటమే. ఒకప్పుడు ఎకోస్పోర్ట్, ఎండీవర్, ఫిగో, ఆస్పైర్ & ఫ్రీస్టైల్ వంటి మోడళ్లను ఉత్పత్తి చేసిన మరైమలై నగర్ ప్లాంట్.. అప్పటి నుంచి (2021 నుంచి) ఖాళీగానే ఉంది.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)