రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్‍ క్వీన్‌, ఆ నిర్మాత ఇంటిపక్కనే!

Published on Thu, 06/01/2023 - 13:05

గ్లామర్‍ క్వీన్‌ ఊర్వశి రౌతేలా మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఫ్యాషన్‌, లగ్జరీకి పెట్టింది పేరైన ఈ అమ్మడు తాజాగా  దిమ్మదిరిగే విలువతో  లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేసిందిట.  దీని  విలువ రూ. 190 కోట్లు ఉంటుందని పలుమీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.  (అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? )

అది కూడా సినీ నిర్మాత యశ్ చోప్రా ఇంటి పక్కనే , బ్రహ్మాండమైన ఎమినిటీస్‌తో  విలాసవంతమైన బంగ్లాకు  ఊర్వశి రౌతేలా షిష్ట్‌ అయినట్టు తెలుస్తోంది. యంగెస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్‌ది యూనివర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నతరువాత, 2013లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇకఅప్పటినుంచి గ్లామరస్‌ లుక్స్‌తో, సక్సెస్‌ఫుల్‌గా  దూసుకుపోతోంది. (రూ.749 కే బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ నథింగ్ ఫోన్ (1), డిస్కౌంట్‌ ఎంతంటే?)

తాజా నివేదికల ప్రకారం అత్యంత ఖరీదైన ఏరియాలో ఉన్న ఈ బంగ్లాలో నాలుగు అంతస్తులున్నాయి. పర్సనల్‌ జిమ్‌  విశాలమైన బాల్కనీ  గార్డెన్‌, తదితర లగ్జరీ  సౌకర్యాలున్నాయి. వందల కోట్ల విలువైన ఈ బంగ్లాకు దానికి తగ్గట్టుగానే అద్భుతమైన ఇంటీరియర్స్‌, ఖరీదైన పెయింటింగ్స్, క్లాసీ లుక్‌లో  అదిరిపోతోందట. 

కేవలం 15 సంవత్సరాల వయస్సులో, ఊర్వశి విల్స్ లైఫ్‌స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్‌లో అదరగొట్టింది. 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటికీ, హనీ సింగ్ మ్యూజిక్ వీడియో లవ్ డోస్‌తో సూపర్‌ పాపులారిటీ సంపాదించింది. యాక్టింగ్‌ కంటే కూడా లావిష్‌ లైఫ్‌ స్టయిల్‌తో హెడ్‌లైన్స్‌లో నిలుస్తూ వస్తోంది. రూ. 40 కోట్ల గోల్డెన్‌ గౌను ,భారీ జాకెట్ తోపాటు, ఫిల్మ్‌ఫేర్ రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో తన ఫేవరెట్ డిజైనర్ మైఖేల్ సిన్కో డిజైన్ చేసిన పర్ఫెక్ట్ స్టైల్ బాడీకాన్ డ్రెస్‌లో  ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది. ఈ డ్రెస్ ధర దాదాపు రూ. 60 లక్షలు. (అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్‌, నెట్‌వర్త్‌ గురించి తెలుసా?)

ఇటీవల కొద్ది రోజుల క్రితం ఊర్వశి తన 29వ పుట్టినరోజును ప్యారిస్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. ఇందుకోసం దాదాపు రూ. 93 లక్షలు వెచ్చించిందంటేనే ఆమె రేంజ్‌ అర్థం చేసుకోవచ్చు. ఈ వేడుకలో 100 వజ్రాలు పొదిగిన గులాబీల 24 క్యారెట్ల గోల్డ కప్‌ కేక్‌లు  డైమండ్ కేక్స్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఇటీవలి ఫ్రాన్స్‌ కేన్స్ కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌లో కూడా తళుక్కున మెరిసిన ఈ భామ  మంచి సందడి చేసిన సంగతి విదితమే. అంతేనా 10 ఏళ్ల దుబాయ్‌ గోల్డెన్ వీసా అందుకున్న తొలి బాలీవుడ్  నటిగ కూడా  ఊర్వశి రౌతేలానే.

Videos

YSR ఫ్లెక్సీలు చింపేసిన దుండగులు.. కూకట్‌పల్లి లో YSRCP ఆందోళన

42 ఉద్యోగ సంఘాలకు లేఖ రాసిన ఏపీ JAC అమరావతి

Srinivasulu Reddy: కొడుకు కోసం మరీ ఇంత దిగజారుతావా..?

ఆపరేషన్ ‘రాటెన్ యాపిల్’.. న్యూయార్క్‌లో వేలాది మంది వలసదారుల అరెస్ట్

స్పోర్ట్స్ కోటాలో DSC అక్రమాలు బట్టబయలు..

బాబు పబ్లిసిటీపై YS జగన్ ఆగ్రహం

దారుణం చీకటిలోకి నేపాల్..నెక్స్ట్ స్టెప్ ఏంటి..?

ఢిల్లీలో YSR అవార్డ్స్-2026 ప్రదానోత్సవం

జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి

మెదక్ లో కాంగ్రెస్ పాలిటిక్స్

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)