రోజుకు రూ.96,383 కోట్లు.. క్యాష్‌ కాదు!

Published on Sun, 08/02/2026 - 12:02

దేశంలో డిజిటల్‌ చెల్లింపుల జోరు కొనసాగుతోంది. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) జూలైలో కొత్త రికార్డు సృష్టించింది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) గణాంకాల ప్రకారం.. జూలైలో యూపీఐ ద్వారా 2,366 కోట్ల లావాదేవీలు జరిగాయి. జూన్‌లో నమోదైన 2,272 కోట్లతో పోలిస్తే ఇది 4.1 శాతం అధికం. గతేడాది జూలైతో పోలిస్తే లావాదేవీల సంఖ్య ఏకంగా 22 శాతం పెరిగింది.

లావాదేవీల విలువ కూడా భారీగా పెరిగింది. జూన్‌లో రూ.28.92 లక్షల కోట్లుగా ఉన్న యూపీఐ లావాదేవీల విలువ.. జూలైలో రూ.29.88 లక్షల కోట్లకు చేరింది. నెలవారీగా ఇది 3.3 శాతం వృద్ధి. అయితే మేలో నమోదైన రూ.29.90 లక్షల కోట్ల రికార్డుతో పోలిస్తే జూలై విలువ స్వల్పంగా తక్కువగానే ఉంది. అంటే జూలైలో లావాదేవీల సంఖ్య మాత్రం ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరగా, విలువలో కొత్త రికార్డు నమోదు కాలేదు.

జూలైలో యూపీఐ రోజుకు సగటున 76.3 కోట్ల లావాదేవీలను ప్రాసెస్‌ చేసింది. జూన్‌లో ఈ సగటు 75.7 కోట్లుగా ఉంది. రోజువారీ లావాదేవీల సగటు విలువ రూ.96,383 కోట్లుగా నమోదైంది. జూన్‌లోని రూ.96,405 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు స్థిరంగానే ఉంది.

ఫాస్టాగ్‌ లావాదేవీలకు బ్రేక్‌

మరోవైపు, ఎన్‌ఈటీసీ ఫాస్టాగ్‌ లావాదేవీల్లో తగ్గుదల కనిపించింది. జూలైలో 34.7 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. జూన్‌లోని 36.2 కోట్లతో పోలిస్తే 4.1 శాతం తగ్గాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే దాదాపు 6 శాతం క్షీణత నమోదైంది. ఫాస్టాగ్‌ లావాదేవీల విలువ కూడా స్వల్పంగా తగ్గింది. జూన్‌లో రూ.7,215 కోట్లుగా ఉన్న విలువ.. జూలైలో రూ.7,143 కోట్లకు పడిపోయింది. మేలో నమోదైన రూ.7,308 కోట్లతో పోల్చినా ఇది తక్కువే.

ఫాస్టాగ్‌ వినియోగంలో ఈ మార్పు నేపథ్యంలో, కేంద్రం అమలు చేస్తున్న వార్షిక పాస్‌ పథకం కూడా కీలకంగా మారింది. 2026-27లో రూ.3,075 చెల్లించి పొందే వార్షిక పాస్‌తో నేషనల్‌ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేల టోల్‌ ప్లాజాల వద్ద ఏడాదిలో 200 సార్లు లేదా ఒక సంవత్సరం వరకు ప్రయాణించే అవకాశం ఉంది. జూన్‌ 2026 నాటికి 77 లక్షలకు పైగా వార్షిక పాస్‌లు జారీ కాగా, ఇవి 63 కోట్ల టోల్‌ లావాదేవీలకు దోహదపడ్డాయని కేంద్రం తెలిపింది.

ఇక యూపీఐ విస్తరణ కూడా వేగంగా కొనసాగుతోంది. జూన్‌ 2026 నాటికి దేశంలో 55.49 కోట్ల మంది యూజర్లు యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై నమోదయ్యారని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. విదేశాల్లోనూ యూపీఐ వినియోగం విస్తరిస్తోంది. గ్రీస్, నేపాల్‌ వంటి దేశాల్లో కొత్త అనుసంధానాలు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: బంగారం, వెండి‌ ధరలు.. వారంలో ఎంత తగ్గాయంటే..

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)