Breaking News

యూపీఐ కొత్త పుంతలు

Published on Sat, 12/23/2023 - 05:26

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) చెల్లింపులు భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నవంబర్‌లో 1,123.5 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ ఏకంగా రూ.17.4 లక్షల కోట్లను తాకింది. ఈ వేగాన్నిబట్టి చూస్తే డిసెంబర్‌ నెల యూపీఐ లావాదేవీల విలువ రూ.20 లక్షల కోట్ల మార్కును చేరే అవకాశం ఉంది. నూతన సంవత్సర వేడుకల కోసం చేసే చెల్లింపులు ఇందుకు దోహదం చేయనున్నాయి. డిసెంబర్‌ 1–18 తేదీల మధ్య 703 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ రూ.11 లక్షల కోట్లు.   

పండుగల సీజన్‌తో..
ఈ ఏడాది జూలై నుంచి సెపె్టంబర్‌ మధ్య యూపీఐ లావాదేవీల విలువ ప్రతి నెల రూ.15.3–15.8 లక్షల కోట్ల మధ్య నమోదైంది. పండుగల సీజన్‌ కారణంగా అక్టోబర్, నవంబర్‌ నెలల్లో యూపీఐ లావాదేవీలతోపాటు విలువ కూడా అనూహ్యంగా పెరిగింది. గడిచిన రెండు మాసాల్లోనూ ప్రతి నెల విలువ రూ.17 లక్షల కోట్ల మార్కును తాకింది. 2023 అక్టోబర్‌లో 1,140.8 కోట్ల లావాదేవీలు జరగగా వీటి విలువ రూ.17.1 లక్షల కోట్లుగా ఉంది. ఇక 2022 డిసెంబర్‌లో రూ.12.8 లక్షల కోట్ల విలువైన 783 కోట్ల లావాదేవీలు జరిగాయి. అదే ఏడాది నవంబర్‌లో రూ.11.9 లక్షల కోట్ల విలువైన 731 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి.  

తొలి స్థానంలో ఫోన్‌పే..  
ప్రస్తుతం భారత్‌లో 516 బ్యాంకులు యూపీఐ సేవలను అందిస్తున్నాయి. థర్డ్‌ పార్టీ యాప్, డిజిటల్‌ పేమెంట్స్, ఫైనాన్షియల్‌ సర్వీసులు అందిస్తున్న ఫోన్‌పే నవంబర్‌ నెలలో రూ. 8,54,939 కోట్ల విలువైన 528 కోట్ల లావాదేవీలతో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. లావాదేవీల విలువ పరంగా గూగుల్‌ పే, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్, క్రెడ్, ఐసీఐసీఐ బ్యాంక్‌ యాప్స్, యెస్‌ బ్యాంక్‌ యాప్స్, భీమ్, అమెజాన్‌ పే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ యాప్స్, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ యాప్స్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.  

చిన్న మొత్తాలే ఎక్కువ..
నవంబర్‌లో విలువ పరంగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు జరిగిన లావాదేవీలు ఏకంగా 74.31 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. వీటి విలువ రూ.12.9 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వ్యక్తుల నుంచి వర్తకులకు జరిగిన లావాదేవీలు 25.69 శాతం వాటాతో రూ.4.46 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఇక పరిమాణం పరంగా వ్యక్తుల నుంచి వర్తకులకు 58.62 శాతం వాటాతో 658.5 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తుల నుంచి వ్యక్తులకు 41.38 శాతం వాటాతో 464.9 కోట్ల లావాదేవీలు జరిగాయి. పరిమాణం పరంగా వ్యక్తుల నుంచి వర్తకులకు చెల్లించిన మొత్తాల్లో రూ.500 లోపు లావాదేవీల సంఖ్య ఏకంగా 83.75 శాతం ఉంది. వ్యక్తుల నుంచి వ్యక్తులకు బదిలీ అయిన మొత్తాల్లో రూ.500 లోపు విలువ చేసే లావాదేవీల వాటా 54.85 శాతం నమోదైంది. దీనినిబట్టి చూస్తే చిన్న మొత్తాలే అధిక సంఖ్యలో చేతులు మారుతున్నాయి.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌