Breaking News

ఆగస్టులో రూ.24 లక్షల కోట్లు: యూపీఐ ఆల్‌టైమ్‌ రికార్డ్

Published on Mon, 09/01/2025 - 15:42

దేశంలో యూపీఐ వినియోగం రోజురోజుకి పెరుగుతోంది. నేడు ఏ చిన్న వస్తువు కొనాలన్నా.. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. దీంతో లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆగస్టులో మాత్రమే 20 బిలియన్ లావాదేవీలు దాటినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది.

ఆగస్టులో జరిగిన మొత్తం లావాదేవీలు (20.01 బిలియన్స్).. జులై (19.47 బిలియన్స్) కంటే 2.8 శాతం ఎక్కువ. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 34 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు తెలుస్తోంది. విలువ పరంగా ఆగస్టులో యూపీఐ లావాదేవీలు రూ. 24.85 లక్షల కోట్లు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 24 శాతం ఎక్కువ అని డేటా చెబుతోంది.

సగటున రోజువారీ లావాదేవీల సంఖ్య 645 మిలియన్లకు పెరిగింది. NPCI డేటా ప్రకారం రోజువారీ లావాదేవీ విలువ రూ. 80,177 కోట్లు కావడం గమనార్హం. ఆగస్టు 2న UPI ఒకే రోజులో 700 మిలియన్ లావాదేవీలను దాటి సరికొత్త రికార్డును సృష్టించింది. రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం ఉన్నప్పటికీ ఆగస్టులో ఈ పెరుగుదల నమోదైంది.

ఇదీ చదవండి: రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక

జూన్‌లో UPI ద్వారా రూ.24.04 లక్షల కోట్ల విలువైన 18.40 బిలియన్ లావాదేవీలు జరిగాయి. ఆ తర్వాత నెలలో ఇది 19.47 బిలియన్ లావాదేవీలకు పెరిగింది, ఇది జూన్‌తో పోలిస్తే 5.8 శాతం పెరుగుదల, లావాదేవీ విలువ రూ.25.08 లక్షల కోట్లకు పెరిగింది. ఇలా ప్రతి నెలా యూపీఐ లావాదేవీలు పెరుగుతూనే ఉన్నాయి.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)