Breaking News

కొత్త ఫీచర్‌: చేతిలోని క్యాష్‌.. ఈజీగా అకౌంట్‌లోకి..

Published on Mon, 09/16/2024 - 15:41

యూపీఐ పేమెంట్స్‌ అందుబాటులోకి వచ్చాక డిజిటల్‌ చెల్లింపుల్లో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు వస్తున్నాయి. ఎవరికి నగదు పంపాలన్నా యూపీఐ యాప్‌ల ద్వారా క్షణాల్లో పంపించేస్తున్నాం. మరి క్యాష్‌ డిపాజిట్‌ అయితే ఏం చేస్తాం.. నేరుగా సంబంధిత బ్యాంకుకు వెళ్లి అకౌంట్‌లో వేయడమో లేదా ఆ బ్యాంకు ఏటీఎం మెషీన్‌లో డిపాజిట్‌ చేయడమో చేస్తాం. కానీ బ్యాంకుతో సంబంధం లేకుండా కేవలం యూపీఐ యాప్‌తో ఏ బ్యాంకు ఖాతాకైనా భౌతిక నగదును డిపాజిట్‌ చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదా.. అలాంటి కొత్త ఫీచర్‌ ఇప్పుడు వచ్చింది.

ఏ బ్యాంక్‌ ఖాతాకైనా..
యూపీఐ ఇంటర్‌ఆపరబుల్ క్యాష్ డిపాజిట్ (UPI-ICD) అనే కొత్త ఫీచర్ ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసే విధానాన్ని మరింత సులువుగా మార్చనుంది. ఈ వినూత్నమైన ఫీచర్‌లో ఏ యూపీఐ యాప్‌ను ఉపయోగించైనా, ఏ బ్యాంక్ ఖాతాలోకైనా నగదును డిపాజిట్ చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన ఏటీఎంలలో ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ అందుబాటులో ఉన్నప్పటికీ, సమీప భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు ఈ సౌలభ్యాన్ని అందించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఈ బ్యాంకులో ఎఫ్‌డీ.. మంచి వడ్డీ!

డిపాజిట్‌ ఇలా.. 
» యూపీఐ-ఐసీడీని సపోర్ట్‌ చేసే అధునాతన నగదు రీసైక్లర్ మెషీన్‌లతో కూడిన ఏటీఎంలను గుర్తించండి.
» మీ యూపై యాప్‌ని తెరిచి ఏటీఎం స్క్రీన్‌పై వచ్చే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేయండి.
» మీరు డిపాజిట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేసి, లబ్ధిదారు ఖాతాను ఎంచుకోండి.
» డిపాజిట్ స్లాట్‌లో నగదు పెట్టండి.
» వివరాలను ధ్రువీకరించి యూపీఐ పిన్ ఉపయోగించి లావాదేవీని పూర్తి చేయండి.

ప్రయోజనాలు
» నగదు తక్షణమే లబ్ధిదారుల ఖాతాకు జమవుతుంది.
» ఏటీఎం నగదు రీసైక్లర్ యంత్రం డిపాజిట్ చేసిన నోట్ల ప్రామాణికతను ధ్రువీకరిస్తుంది.
» ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.50,000 డిపాజిట్‌ చేసేందుకు వీలు.
» మొత్తం ప్రక్రియ డిజిటల్‌గా జరగుతుంది. ఎలాంటి కార్డ్స్‌, భౌతిక స్లిప్‌ల అవసరం ఉండదు.
» ఇతర యూపీఐ లావాదేవీల మాదిరిగానే వీటికీ భద్రత ఉంటుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)