Breaking News

రుణాల మంజూరులో కీలకంగా యూపీఐ

Published on Sun, 12/08/2024 - 04:35

న్యూఢిల్లీ: రుణాల మంజూరులో యూని ఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) కీలకంగా మారిందని ఒక నివేదిక వెల్లడించింది. ‘ఓపెన్‌ బ్యాంకింగ్, డిజిటల్‌ చెల్లింపులు: రుణం పొందడంలో చిక్కులు’ పేరుతో చేసిన అధ్యయనం ప్రకారం.. ప్రధానంగా క్రెడిట్‌ హిస్టరీ (గతంలో రుణం పొందడం) లేని వారు రుణం అందుకోవడానికి యూపీఐ దోహద పడుతోంది. యూపీఐ యాప్స్‌ ఆధారంగా జరిగిన డిజిటల్‌ చెల్లింపుల లావాదేవీల సమాచారం అందుబాటులో ఉన్నందున.. రుణ మంజూరుకై నిర్ణయాలు తీసుకునేందుకు రుణ దాతలకు మార్గం సుగమం అవుతోంది. 

మొదటిసారిగా అధికారికంగా రుణం అందుకోవడానికి సామాన్యులకు వీలు కల్పి స్తోంది. యూపీఐ లావాదేవీలలో 10% పెరుగుదల క్రెడిట్‌ లభ్యత 7% దూసుకెళ్లేందుకు దారితీసింది. రుణగ్రహీ తలను మెరుగ్గా అంచనా వేయడానికి రుణదాతల కు డిజిటల్‌ ఫైనాన్షియల్‌ హిస్టరీలు ఎలా ఉపయోగపడ్డాయో ఈ గణాంకాలు ప్రతి బింబిస్తున్నాయి. రుణాల్లో వృద్ధి ఉన్నప్ప టికీ డిఫాల్ట్‌ రేట్లు పెరగలేదు. యూపీఐ– ఆధారిత డిజిటల్‌ లావాదేవీ డేటా రుణ దాతలు బాధ్యతాయుతంగా విస్తరించడంలో సహాయపడింది. 2016లో ప్రారంభించినప్పటి నుండి భారత్‌లో ఆర్థిక లభ్యతను యూపీఐ సమూలంగా మార్చింది.

75 శాతం యూపీఐ కైవసం..
యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ 30 కోట్ల మంది వ్యక్తులు, 5 కోట్ల మంది వ్యాపా రులు అడ్డంకులు లేని డిజిటల్‌ లావా దేవీలను నిర్వహించడానికి వీలు కల్పించింది. 2023 అక్టోబర్‌ నాటికి భారత్‌లోని మొత్తం రిటైల్‌ డిజిటల్‌ చెల్లింపుల్లో 75 శాతం యూపీఐ కైవసం చేసుకుంది. పాల్గొనే బ్యాంకుల కస్టమర్లందరికీ చెల్లింపులను సేవగా అందించడానికి యాప్‌లను రూపొందించడానికి థర్డ్‌ పార్టీ వెండార్లను యూపీఐ చెల్లింపుల వ్యవస్థ అనుమతిస్తుంది. రియల్‌ టైమ్‌లో ధృవీకరించదగిన డిజిటల్‌ లావాదేవీల సమాచారం యూపీఐ ఆధారంగా అందుబాటులో ఉంటుంది.

 కస్టమర్లు ఈ సమాచారాన్ని రుణాన్ని అందుకునే ప్రక్రియలో భాగంగా ఆర్థిక సంస్థలు, అనుబంధ కంపెనీలతో పంచుకో వచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విస్తృతంగా యూపీఐని ఆదరించడంలో అందుబాటులో ఉన్న డిజిటల్‌ టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. యూపీఐతో భారత దేశం సాధించిన విజయం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. పబ్లిక్‌ డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఓపెన్‌ బ్యాంకింగ్‌ విధానాలతో కలపడం ఎక్కువ మందికి రుణాలు అందుతాయి. అలాగే ఆవిష్కరణలను, సమానమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని అధ్యయనం వివరించింది. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)