Breaking News

పల్లె మహిళల్లోనూ యూపీఐ పరిమళాలు

Published on Fri, 03/06/2026 - 08:29

గ్రామీణ, చిన్న పట్టణాల్లోని మహిళలు సైతం నిత్యజీవితంలో భాగంగా యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) సాధనంతో అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. గ్రోసరీ చెల్లింపులు, మొబైల్, యుటిలిటీ బిల్లు చెల్లింపులు, రీచార్జ్‌లను యూపీఐ ద్వారా కానిచ్చేస్తున్నారు. పెట్టుబడుల విషయంలోనూ వీరు ఆసక్తి చూపిస్తున్నట్టు ‘పే నియర్‌బై ఉమెన్‌ ఫైనాన్షియల్‌ ఇండెక్స్‌ 2026’ ఆరో ఎడిషన్‌ నివేదిక వెల్లడించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఆర్థిక సేవలను అందించే 10,000 మంది మహిళా ఏజెంట్లను సర్వే చేసి ‘పే నియర్‌బై’ ఈ వివరాలు విడుదల చేసింది.

  • గ్రామీణ, చిన్న పట్టణాల్లో 38 శాతం మహిళలు వారంలో కనీసం ఒకసారి యూపీఐని వినియోగిస్తున్నారు.  

  • ఆస్తుల అనుసంధాన ఉత్పత్తులు, పెట్టుబడుల పట్ల మహిళల్లో అవగాహన పెరుగుతోంది.  

  • కుటుంబంలో తామే ప్రాథమిక పొదుపుదారులమని 85 శాతం మహిళలు తెలిపారు.  

  • బంగారం ఆధారిత సాధనాల్లో పెట్టుబడుల పట్ల 44% మహిళలు ఆసక్తి చూపించారు. తమకు అందుబాటులోని సేవా పాయింట్ల ద్వారా చిన్న మొత్తంతో బంగారం సాధనాల్లో సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేస్తామని చెప్పారు. కొత్త పొదుపు సాధనాల పట్ల వారిలో ఆసక్తికి ఇది నిదర్శనం.

  • సులభంగా ఉపసంహరించుకునే ఫిక్స్‌డ్, రికరింగ్‌ డిపాజిట్లకు మహిళల్లో ఆదరణ కనిపించింది. వీటిల్లో ఇన్వెస్ట్‌ చేస్తామని 98 శాతం మంది మహిళలు తెలిపారు.  

  • కాకపోతే ఇటీవలి కాలంలో ఎక్కువగా ఆదరణ, అవగాహనకు నోచుకుంటున్న మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల విషయంలో మాత్రం మహిళల్లో ఆసక్తి ఆశించినంత లేదు. వీటి పట్ల గ్రామీణ, చిన్న పట్టణాల్లో 10 శాతం మంది మహిళల్లోనే అవగాహన ఉండడం గమనార్హం.  

  • ఒకవైపు డిజిటల్‌ చెల్లింపులూ క్రమంగా పెరుగుతుండగా.. మరోవైపు నగదు వినియోగం కూడా ప్రధానంగానే ఉంది. ఇంటి ఖర్చులతోపాటు, అవసరమైనప్పుడు వినియోగించేందుకు వీలుగా వారు నగదుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.  

  • నగదు ఉపసంహరణకు బయోమెట్రిక్‌ గుర్తింపు లేదా ముఖ గుర్తింపును సౌకర్యంగా భావిస్తున్నారు. చాలా మంది మహిళల నగదు ఉపసంహరణ రూ.1,000–2,500 మధ్య ఉంటోంది.

  • బీమా రక్షణ విషయమై అధిక శాతం మంది మహిళల్లో అవగాహన ఉంది. కానీ, తీసుకునే వారు 26 శాతంగానే ఉన్నారు. ఆరోగ్య, జీవిత, ప్రమాద బీమాకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

సొంతంగానే కానిచ్చేస్తున్నారు..

‘‘మరింత మంది మహిళలు స్వతంత్రంగానే తమ బ్యాంక్‌ ఖాతాలను నిర్వహించుకుంటున్నారు. క్రమశిక్షణతో నెలవారీ పొదుపు చేసుకోవడం, బంగారం సాధనాలు, బీమా, సంఘటిత రంగంలో రుణాల పట్ల సుముఖత చూపిస్తున్నారు. ఆర్థిక సాధనాల పట్ల అవగాహన పెరిగే క్రమంలో విశ్వసనీయమైన సహాయక నమూనాలు వారధిగా పనిచేస్తాయి. మహిళలు ఒకరి మార్గదర్శనానికి బదులు సొంతంగానే ఆర్థిక అంశాల్లో భాగస్వాములయ్యేందుకు వీలు కల్పిస్తాయి’’అని పే నియర్‌బై ఎండీ, సీఈవో ఆనంద్‌ కుమార్‌ బజాజ్‌ తెలిపారు.

ఇదీ చదవండి: ప్రకటనల రంగంలో ఏఐ విప్లవం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)