Breaking News

UPI Fraud: దెబ్బకు రూ. 35 లక్షలు గోవింద: ఎక్కడంటే?

Published on Mon, 04/03/2023 - 21:52

టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. మోసాలు కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. యుపిఐ వినియోగంలోకి వచ్చిన తరువాత అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే కొంతమంది కేటుగాళ్లు ఈ UPIలో కూడా భారీ ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు.

నివేదికల ప్రకారం, ఇటీవల గురుగ్రామ్‌కు చెందిన పారావియమ్ టెక్నాలజీస్ ఇలాంటి యుపిఐ మోసానికి గురైనట్లు తెలిసింది. సైబర్ నేరగాళ్లు కంపెనీ పేమెంట్ గేట్‌వే సిస్టమ్‌ను తారుమారు చేసి ఏకంగా రూ. 35 లక్షలు దోచేశారు. కంపెనీ ఉపయోగించుకుంటున్న క్యాష్‌ఫ్రీ పేమెంట్ గేట్‌వేని తారుమారు చేసి డబ్బు దోచుకున్నట్లు సంస్థ ఆపరేషన్స్ హెడ్ అంకిత్ రావత్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.

నిజానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో సైబర్ నేరగాళ్లు 95,000 యుపిఐ మోసాలకు పాల్పడినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కావున తప్పకుండా యుపిఐ వినియోగదారులు జాగ్రత్త వహించాలి. లేకుంటే భారీ మొత్తంలో డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది.

యుపిఐ మోసాల నుంచి తప్పించుకోవడం ఎలా?

  • మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఓటిపి, పిన్ వంటి సమాచారాలను ఎప్పుడు, ఎవరితోనూ పంచుకోకూడదు. 
  • అమౌంట్ తీసుకోవడానికి మీరు పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు మాత్రమే పిన్ అవసరం.
  • డబ్బు ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ చేయడానికి ముందు వారి వివరాలను తప్పకుండా కన్ఫర్మ్ చేసుకోవాలి. 
  • యుపిఐ ఉపయోగిస్తున్నప్పుడు పబ్లిక్ నెట్‌వర్క్‌లను ఉపయోగించడం మానుకోవాలి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)