Breaking News

అంటార్కిటికాలో భారత మైత్రి-2 పరిశోధనా కేంద్రం

Published on Thu, 12/18/2025 - 18:36

మంచు ఖండం అంటార్కిటికాలో శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడంలో భారతదేశం మరింత పట్టు సాధించనుంది. తూర్పు అంటార్కిటికాలో భారత్ నిర్మించదలచిన సరికొత్త పరిశోధనా కేంద్రం ‘మైత్రి-2’ 2032 నాటికి సిద్ధం కానుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను 2029 లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడినట్లు ప్రభుత్వం చెప్పింది. సుమారు రూ.2,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ కేంద్రం దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న మైత్రి-1 స్థానాన్ని భర్తీ చేయనుంది.

మైత్రి-1

1981లో భారత అంటార్కిటిక్ యాత్రలు ప్రారంభమైనప్పటికీ 1989లో షిర్మాకర్ ఒయాసిస్‌లో స్థాపించిన మైత్రి-1 ఇండియా పరిశోధనలకు కీలకంగా నిలిచింది. అంతకుముందు ఉన్న ‘దక్షిణ గంగోత్రి’ మంచులో కూరుకుపోయిన తర్వాత మైత్రి-1 ప్రధాన కార్యస్థానంగా మారింది.

మైత్రి-1 సాధించిన విజయాలు

గత 35 ఏళ్లుగా నిరంతరాయంగా శాస్త్రవేత్తలకు ఆశ్రయం ఇస్తూ వాతావరణ మార్పులపై విలువైన డేటాను అందించింది. భూగర్భ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, హిమానీనదాల అధ్యయనంలో మైత్రి కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ స్టేషన్ పాతబడటంతో పెరిగిన అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో మైత్రి-2 నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

మైత్రి-2 భవిష్యత్ పరిశోధనల దిశగా..

  • మైత్రి-2 అత్యాధునిక సాంకేతికతతో కూడిన శాస్త్రీయ ప్రయోగశాల. ఈ స్టేషన్ ద్వారా భారత్ చేపట్టబోయే ప్రధాన పరిశోధనలు ఇవే:

  • ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అంటార్కిటిక్ మంచు ఫలకాలు కరగడాన్ని నిశితంగా పరిశీలించడం. ఇందుకోసం అధునాతన ‘ఐస్-కోర్ స్టోరేజ్’ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు.

  • తీవ్రమైన చలిలో జీవించే సూక్ష్మజీవులు, వృక్షజాతులపై పరిశోధనలు చేయడానికి ప్రత్యేక జీవ, సూక్ష్మజీవుల పరిశోధన కేంద్రం అందుబాటులోకి రానుంది.

  • ఓజోన్ పొరలో మార్పులు, భూకంప తరంగాల పర్యవేక్షణ, దీర్ఘకాలిక పర్యావరణ స్థితిగతులను ఈ స్టేషన్ ట్రాక్ చేస్తుంది.

  • ఏడాది పొడవునా ఎటువంటి ఆటంకం లేకుండా శాస్త్రీయ కార్యకలాపాలు సాగడానికి బలమైన రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థను మైత్రి-2లో రూపొందిస్తున్నారు.

ప్రస్తుత స్థితి.. సవాళ్లు

కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం, మైత్రి-2 నిర్మాణాన్ని కొన్ని కారణాల వల్ల 2032కి మార్చారు. దీనికి అవసరమైన ఆర్కిటెక్చరల్ డిజైన్, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం ప్రభుత్వం రూ.29.2 కోట్లను ఇప్పటికే మంజూరు చేసింది. కఠినమైన వాతావరణ పరిస్థితులు, రవాణా సవాళ్ల దృష్ట్యా ఈ నిర్మాణానికి పట్టే ఏడేళ్ల సమయం అత్యంత కీలకం.

గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCPOR) ఆధ్వర్యంలో భారత్ అంటార్కిటికాలో తన ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేస్తోంది. మైత్రి-2 అందుబాటులోకి రావడం ద్వారా కేవలం పరిశోధనల పరిధి పెరగడమే కాకుండా ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో భారతదేశం తన నాయకత్వ పాత్రను చాటుకుంటుంది.

ఇదీ చదవండి: ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్‌ క్యూఆర్ కోడ్ బోర్డులు

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు