Breaking News

లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కార్లు - వివరాలు

Published on Tue, 11/21/2023 - 21:24

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది, విస్తరిస్తున్న మార్కెట్ అవసరాలను తీర్చడానికి వాహన తయారీదారులు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నారు. దేశీయ విఫణిలో త్వరలో విడుదలయ్యే టాప్ 5 కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

2024 మారుతి సుజుకి స్విఫ్ట్
దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యధిక అమ్మకాలు పొందిన మారుతి సుజుకి సరికొత్త అవతార్‌లో విడుదలకావడానికి సిద్ధమవుతోంది. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్‌ పేరుతో విడుదలకానున్న ఈ కొత్త కారు ఇప్పటికే చాలాసార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది 2024 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

టాటా పంచ్ ఈవీ
సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగిన టాటా పంచ్ త్వరలో ఎలక్ట్రిక్ కారుగా విడుదల కావడానికి సన్నద్ధమవుతోంది. ఇది జెనరేషన్ 2 ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఒక ఛార్జ్‌తో సుమారు 300 కిమీ నుంచి 350 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. సరైన గణాంకాలు లాంచ్ సమయంలో అధికారికంగా విడుడలవుతాయి.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్
కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ అవుట్‌గోయింగ్ మోడల్ కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుందని, ఇందులో ADAS వంటి లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయని తెలుస్తోంది. 2024 ప్రారంభంలో విడుదల కానున్న ఈ కారు ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది.

మహీంద్రా థార్ 5 డోర్
ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలు పొందిన మహీంద్రా థార్.. త్వరలో 5 డోర్ రూపంలో విడుదలకానుంది. ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కారు అవుట్‌గోయింగ్ వెర్షన్‌తో పోలిస్తే అదనపు టెక్నాలజీ, ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్ లైట్‌ - కొత్త ఫీచర్స్‌తో సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌.. 

టాటా కర్వ్ ఈవీ
2023 ఆటో ఎక్స్‌పోలో కనువిందు చేసిన టాటా కర్వ్ ఈవీ 2024 చివరి నాటికి భారతీయ మార్కెట్లో లాంచ్ అవుతుందని సమాచారం. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు ఫుల్ ఛార్జ్‌తో 400 కిమీ నుంచి 500 కిమీ పరిధిని అందిస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)