Breaking News

2025లో లాంచ్.. ఇప్పుడే సిద్దమైన డుకాటీ

Published on Sun, 12/08/2024 - 20:20

ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'డుకాటీ' సరికొత్త మల్టిస్ట్రాడా వీ2, వీ2 ఎస్ బైకులను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ ఈ బైకులను వచ్చే ఏడాది (2025) లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

2025లో లాంచ్ కానున్న కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా వీ2 బైక్.. దాని మునుపటి మోడల్స్ కంటే కూడా 18 కేజీల తక్కువ బరువుతో ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 19 లీటర్లు. ఇందులోని 890 సీసీ ఇంజిన్ 115.6 హార్స్ పవర్, 92.1 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ క్లచ్ అండ్ బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ పొందుతుంది.

కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కాకుండా డిజైన్, ఫీచర్స్ వంటివన్నీ రెండింటిలోనూ ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఎస్ వేరియంట్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ యూనిట్. ఈ బైక్ ముందు భాగంలో 120/70-ఆర్19 టైర్‌, వెనుక 170/60-ఆర్19 టైర్‌లు ఉన్నాయి. ఇందులో 320 మిమీ ఫ్రంట్ డిస్క్‌లు, వెనుక 265 మిమీ రియర్ డిస్క్ ఉన్నాయి.

మల్టీస్ట్రాడా వీ2 ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్‌లు, స్విచబుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, పవర్ మోడ్‌లు, ఇంజిన్ బ్రేకింగ్ కంట్రోల్‌తో కూడిన సరికొత్త ఎలక్ట్రానిక్స్ వంటివన్నీ ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ 5 ఇంచెస్ టీఎఫ్‌టీ డిస్‌ప్లేలో కనిపిస్తాయి. ప్రస్తుతం కంపెనీ ఈ బైక్ ధరలను వెల్లడించలేదు. అయితే ధరలు రూ. 16 లక్షల కంటే ఎక్కువ ఉండొచ్చని సమాచారం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)