Breaking News

అవమానానికి గుణపాఠం.. తలపాగా రంగుకు తగ్గ రోల్స్ రాయిస్

Published on Mon, 05/29/2023 - 17:31

Reuben Singh: భారతీయులకు సహనం, పట్టుదల వంటివి చాలా ఎక్కువ. అయితే కోపంలో కూడా ఏ మాత్రం తీసిపోరు. దీనికి నిదర్శనమే లండన్‌లో స్థిరపడిన భారత సంతతికి చెందిన వ్యాపార వేత్త 'రూబెన్ సింగ్'. తన తలపాగాను అవమానించిన వారికి సరైన గుణపాఠం చెప్పడానికి ఏకంగా 15 కంటే ఎక్కువ ప్రపంచంలో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసాడు. ఇన్ని రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్న వ్యక్తి ప్రపంచంలో బహుశా ఇతడే అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు.

జీవితంలో ఒక్క రోల్స్ రాయిస్ కొంటే చాలు అనుకునే వ్యక్తులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, జీవితంలో ఒక్క సారైనా రోల్స్ రాయిస్ కార్లను ఎక్కాలి అని అందరికి ఉంటుంది. అలాంటిది ఎవరో హేళన చేసారని, తలపాగా విలువేంటో చూపించాలని ఇన్ని ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు రూబెన్ సింగ్.

ఒక ఇంగ్లాండ్ వ్యక్తి తన తలపాగాను అవమానిస్తూ బ్యాండేజ్ అని ఎగతాళి చేసేవాడని, దానికి విసుగు చెందిన సింగ్ నా తలపాగా పవర్ ఏంటో చూపిస్తా అని తలపాగా రంగుకి తగ్గ రోల్స్ రాయిస్ కొనేసాడు. దెబ్బతో ఎగతాళి చేసినవాడు నివ్వెరపోయాడు. ప్రస్తుతం అతని వద్ద 15 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు ఉన్నట్లు సమాచారం. 

రూబెన్ సింగ్ ఎవరు?
బ్రిటన్ బిల్ గేట్స్‌గా ప్రపంచానికి సుపరిచితమైన రూబెన్ సింగ్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. ఇంగ్లాండ్ వ్యక్తికి తనకి జరిగిన ఒక పందెంలో ఎవరు ఓడిపోతే వారు స్వచ్చంద సంస్థకు విరాళంగా డబ్బు ఇవ్వాలని పందెం వేసుకున్నారు. సిక్కు మతానికి చెందిన రూబెన్ వారానికి తాను ధరించే తలపాగా రంగుకి తగ్గ రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసాడు. రోల్స్ రాయిస్ కార్లతో వరం రోజులు తానూ ధరించే తలపాగా రంగుని బట్టి దిగిన ఫోటోలు గతంలో సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి.

(ఇదీ చదవండి: అనుకున్నదాని కోసం ఐఏఎస్ వదిలేసాడు - ఎవరీ బాలగోపాల్ చంద్రశేఖర్!)

తల్లితండ్రుల మీద ఆధారపడ కుండా తన సొంత తెలివితేటలతో ఎంతో శ్రమించి భారీగా డబ్బు సంపాదించాడు. 1990లో ఇంగ్లాండులో మిస్ ఆటిట్యూడ్ అనే ఫ్యాషన్ చైనా బిజినెస్ స్థాపించి కోట్లు సంపాదించగలిగాడు. 17వ ఏట నుంచి రోజుకి 20 గంటలు కస్టపడి గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసాడు. ఆ తరువాత కొన్ని రోజులకు తన సంస్థ కొంత వెనుకపడింది. అయినప్పటికీ పట్టు వదలకుండా శ్రమించి లాభాల బాటలో పయనించేలా చేసాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు