Breaking News

అక్కడ ఒక్కసారిగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

Published on Thu, 03/20/2025 - 15:30

గత ఏడాది మార్చిలో పెట్రోల్, డీజిల్ ధరలు రెండు రూపాయలు తగ్గింది. ఆ తరువాత ధరల తగ్గుదల ఊసేలేదు. అయితే ఇప్పుడు ఇంధన ధరలను తగ్గించి, ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశ్యంతో మోదీ ప్రభుత్వం ముందడుగు వేసింది.

2019-20లో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.72.69, రూ.65.78 వద్ద ఉండేవి. 2023-24లో రూ.96.63, రూ. 89.53 వద్దకు చేరాయి. తాజాగా ఈ ధరలను రూ. 94.74, రూ. 87.64 వద్దకు (ఢిల్లీ) తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి 'సురేష్ గోపి' పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇంధన ధరలు సుమారు రెండు రూపాయల వరకు తగ్గినట్లు తెలుస్తోంది.

ఇంధన ధరలు 2021-22 సమయంలో గరిష్ట స్థాయికి చేరాయి. ఆ తరువాత ప్రభుత్వం నవంబర్ 2021 - మే 2022లో పెట్రోల్ & డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13, రూ.16 తగ్గించింది. దీంతో ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న వివిధ చర్యల ఫలితంగా ఇంధన ధరలు తగ్గాయని సురేష్ గోపి అన్నారు.

ఇదీ చదవండి: రూ.25 వేల కోట్ల రాజభవనంలో మహారాణి.. అయినా..!

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి, ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలంటే.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ రేట్లను తగ్గించాలని సురేష్ గోపి సూచించారు. అంతర్జాతీయ ధరల పెరుగుదల నుంచి సామాన్య ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అంతే కాకుండా దిగుమతులను తగ్గించి.. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచడం వంటివి కూడా చేస్తున్నట్లు సురేష్ గోపి వెల్లడించారు.

ప్రస్తుతం తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ఢిల్లీకి మాత్రమే పరిమితం. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలలో పెట్రోల్ ధరలు రూ. 100 కంటే ఎక్కువే ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)