Breaking News

Union Budget 2023-24: వేతన జీవులకు ఊరట, శ్లాబుల్లో మార్పులు

Published on Wed, 02/01/2023 - 12:36

న్యూఢిల్లీ: ఆర్థిక  మంత్రి నిర్మలా సీతారామన్‌ వేతన జీవులకు ఊరట కల్పించారు. ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షల నుంచి  7  లక్షలకు పెంచారు. అలాగే ఉద్యోగుల పన్ను శ్లాబులను ప్రస్తుతం 6 నుంచి 5 కు తగ్గించారు.  అయితే ఆదాయం రూ.7 లక్షలు  దాటితే  మాత్రం పన్ను రూ.3 లక్షల నుంచే మొదలవుతుంది. 

ట్యాక్స్‌ స్లాబ్స్‌ 6 నుంచి 5 కి తగ్గింపు
0-3 లక్షల వరకు పన్నులేదు
రూ. 3 - 6 లక్షల వరకు 5% పన్ను
రూ. 6 - 9 లక్షల వరకు 10% పన్ను
రూ. 9 -12 లక్షల వరకు 15% పన్ను
రూ. 12- 15 లక్షల వరకు 20% పన్ను
రూ.15 లక్షలు ఆదాయం దాటితే 30% పన్ను

దీని ప్రకారం ఆదాయం రూ. 7లక్షలు దాటితే 3 లక్షల ఆదాయంనుంచి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.9 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు, రూ.15లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.లక్షా 5వేలుగా  ట్యాక్స్‌ ఉండనుంది. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్‌ల సగటు ప్రాసెసింగ్ సమయాన్ని 93 రోజుల నుంచి 16 రోజులకు తగ్గించారు. 

సీనియర్‌ సిటిజన్లకు ఊరట
కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ సీనియర్‌ సిటిజన్లకు ఊరట ప్రకటించారు. సీనియర్‌ సిటిజన్ల  డిపాజిట్ గరిష్ఠ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. అలాగే సేవింగ్ అకౌంట్ పరిమితిని రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు. ఇక ఇప్పటివరకు ఉన్న 80సి కింద మినహాయింపులు చూపించుకోవాలంటే  పాత పన్ను పద్ధతిని ఎంచుకోవాలి.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)