Breaking News

కేంద్ర బడ్జెట్‌ 2023: గుడ్‌ న్యూస్‌.. మహిళల కోసం మరిన్ని పథకాలు

Published on Wed, 02/01/2023 - 11:42

ప్రపంచ ఆర్థిక దృక్పథం నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2023-24ను సమర్పించారు. ఆనంతరం ఆమె ప్రసంగిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో ఉందని, ఉజ్వల భవిష్యత్తు వైపు పయనిస్తోందన్నారు. 2014 నుంచి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పౌరులందరికీ మెరుగైన జీవన ప్రమాణాలతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాయన్నారు. 

మహిళల కోసం ప్రత్యేకం
పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల సమగ్ర అభివృద్ధిపై శ్రద్ద పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్‌లో రైతులు, యువత, మహిళలు ,వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నామన్న నిర్మలమ్మ వారి కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. స్వయం సహాయక బృందాల ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతను పెంచడం బడ్జెట్‌లోని ముఖ్యమైన వాటిలో ఒకటి అని చెప్పారు. యువతకు ఉపాధి లభించేలా ఉద్యోగాల వృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇక వ్యవసాయంలో ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. 

మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ అనే కొత్త పథకాన్ని బడ్జెట్‌లో కేంద్రం ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్సిడ్‌ డిపాజిట్‌ పథకంలో ఖాతాదారులు చేసే డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్టంగా రూ.2 లక్షలు వరకు ఈ పథకంలో డిపాజిట్‌ చేయవచ్చు. పాక్షిక మినహాయింపులకు అవకాశం ఉంటుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)