Breaking News

లాభాల బాటలో యూనియన్ బ్యాంక్.. పెరిగిన ఆదాయం!

Published on Tue, 10/20/2026 - 15:47

ప్రభుత్వ రంగ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2026–27) రెండో త్రైమాసికంలో రూ. 5,781 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ. 4,425 కోట్లతో పోలిస్తే  31 శాతం పెరిగింది. నికర వడ్డీ ఆదాయం పెరగడం, ఆస్తుల నాణ్యత మెరుగుపడడం ఇందుకు దోహదపడ్డాయి. స్టాండెలోన్‌ ప్రాతిపదికన జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నికరలాభం 30.32 శాతం వృద్ధితో రూ. 5,537.20 కోట్లకు చేరింది.

గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ .4,249.98 కోట్లుగా ఉంది. కీలకమైన నికరవడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 20.09 శాతం పెరిగి రూ.10,583 కోట్లకు చేరింది. అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే ఇది 5.43 శాతం పెరుగుదల. వడ్డీయేతర ఆదాయం 6.90 శాతం తగ్గి రూ.4,651 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా ట్రెజరీ ఆదాయం గణనీయంగా తగ్గడం కారణమైంది.

ట్రెజరీ ఆదాయం 34.60 శాతం క్షీణించి రూ.701 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.1,073 కోట్లుగా ఉంది. కరెంట్‌ అకౌంట్, సేవింగ్స్‌ అకౌంట్‌ (సీఏఎస్‌ఏ) డిపాజిట్ల వాటా పెరిగింది. దేశీయ రుణాల పంపిణీ 17.35 శాతం పెరిగి రూ.11.06 లక్షల కోట్లకు చేరింది. రిటైల్, వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కలిపి మొత్తంగా ఇచ్చిన రుణాలు 14.65 శాతం పెరిగి రూ.6.36 లక్షల కోట్లకు చేరాయి.

ఇదీ చదవండి: 109 ఏళ్ల క్రితం బ్రిటన్‌కు ఇచ్చిన డబ్బు.. ఇప్పటికీ తేలని లెక్క!

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)