Breaking News

ఉద్యోగానికి అప్లయ్‌ చేస్తే.. ఇదేందయ్యా ఇది, ఎక్కడా సూడ్లా!

Published on Thu, 09/07/2023 - 16:57

 ఏదైనా  ఉద్యోగానికి అప్లయ్‌ చేసుకోవడం, సంబంధిత సంస్థల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం కామన్‌.  మన ప్రొఫైల్ నచ్చకపోయినా, వారి రిక్వైర్‌మెంట్‌కు తగినట్టుగా లేకపోయినా జాబ్‌ రాదు.   అయితే చాలావరకు ఐటీ  కంపెనీలు  మిమ్మల్ని సెలెక్ట్‌ చేయలేదు సారీ అనే మెయిల్స్‌ కూడా చూశాం. తాజాగా సిలికాన్‌ వ్యాలీకంపెనీ చేసిన పని ఇంటర్నెట్‌లో  చక్కర్లు  కొడుతోంది. రెడ్డిట్‌ యూజర్‌ షేర్‌ చేసిన కథనం  నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

సిలికాన్ వ్యాలీ-ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సీక్రెట్ సుషీ ఉద్యోగం అప్లయ్‌ చేసిన వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇటీవల ఒక మహిళా ఉద్యోగ అభ్యర్థికి తిరస్కరణ లేఖతో పాటు అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌ను పంపింది. దీంతో  ఎంత దయగల కంపెనీ అనే ప్రశంసలు  దక్కించుకుంది. మేల్‌విచ్‌ స్క్వేర్‌  అనే Reddit వినియోగదారు 'రిక్రూటింగ్‌హెల్' సబ్‌రెడిట్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు. మేనేజర్ జాబ్‌కోసం ఆమె దరఖాస్తు చేశారు.

ఇంటర్వ్యూలు ఫేస్‌ చేశారు. ఆ తరువాత  ప్రతి రోజు, ఆమె తన ఇన్‌బాక్స్‌ను ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు.  అయితే  అనుకోకుండా సీక్రెట్ సుషీ నుండి అందుకున్న దరఖాస్తుదారునికి ధన్యవాదాలు తెలుపుతూ, సెలెక్ట్‌ చేయలేదని చెప్తూనే,గిఫ్ట్‌ వోచర్‌ సెండ్‌చేసింది. ఈ తిరస్కరణ ఇమెయిల్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసింది. దీంతోపాటు తనకొచ్చిన  7 డాలర్లు  గిఫ్ట్‌ వోచర్‌ ను కూడా షేర్‌ చేస్తూ..  " మర్చిపోలేని అత్యుత్తమ తిరస్కరణ" అంటూ పోస్ట్‌పెట్టారు.  దీంతో ఇది వైరల్‌గా మారింది.


 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)