Breaking News

5.2% వద్దే నిరుద్యోగం

Published on Tue, 11/18/2025 - 04:54

న్యూఢిల్లీ: నిరుద్యోగ రేటు అక్టోబర్‌లో 5.2 శాతం వద్దే కొనసాగింది. సెపె్టంబర్‌లోనూ 5.2 శాతంగా ఉండగా, ఆగస్ట్‌లో 5.1 శాతం, జూలైలో 5.2 శాతం, మే, జూన్‌లో 5.6 శాతం, ఏప్రిల్‌లో 5.1 శాతం వద్ద ఉండడం గమనార్హం. అక్టోబర్‌ నెలకు సంబంధించి పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. 15 ఏళ్ల వయసు పైబడిన వారికి సంబంధించిన గణాంకాలు ఇవి.  

→ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం కాస్తంత తగ్గుముఖం పట్టింది. సెప్టెంబర్‌లో 4.6 శాతంగా ఉంటే, అక్టోబర్‌లో 4.4 శాతానికి తగ్గింది. 

→ పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పరిస్థితులు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. నిరుద్యోగం రేటు సెపె్టంబర్‌లో ఉన్న 6.8 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది.  

→ మొత్తం మీద 15 ఏళ్లు నిండిన మహిళల్లో 
నిరుద్యోగం 5.5 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గింది. గ్రామీణ మహిళల్లో నిరుద్యోగ రేటు 4.3 శాతం నుంచి 4 శాతానికి పరిమితమైంది.  

→ పురుషులకు సంబంధించి నిరుద్యోగ రేటు అక్టోబర్‌లో 5.1 శాతం వద్ద స్థిరంగా ఉంది. గ్రామీణ పురుషుల్లో నిరుద్యోగం 4.7 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గింది. అదే పట్టణాల్లో మాత్రం 6 శాతం నుంచి 6.1 శాతానికి పెరిగింది. 

→ వర్కర్‌–పాపులేషన్‌ రేషియో (మొత్తం జనాభాలో ఉపాధి పొందుతున్న వారు) 52.5 శాతంగా ఉంది. మహిళల్లో వర్కర్‌ పాపులేషన్‌ రేషియో స్థిరంగా పెరుగుతూ వస్తోంది. జూన్‌లో ఇది 30.2 శాతంగా ఉంటే, అక్టోబర్‌లో 32.4 శాతానికి మెరుగుపడింది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది జూన్‌లో 33.6 శాతంగా ఉంటే, అక్టోబర్‌ నాటికి 36.9 శాతానికి పెరిగింది. 

→ లేబర్‌ ఫోర్స్‌ పారి్టసిపేషన్‌ రేట్‌ (ఎల్‌ఎఫ్‌పీఆర్‌) జూన్‌లో ఉన్న 54.2 శాతం నుంచి అక్టోబర్‌లో 55.4 శాతానికి మెరుగుపడింది.   
 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు