Breaking News

నైపుణ్యాల కొరతే అడ్డు

Published on Sat, 07/15/2023 - 04:57

న్యూఢిల్లీ: నిరుద్యోగం పట్ల ప్రజల్లో ఉన్న ఆలోచనా ధోరణి సరైంది కాదని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. నరేంద్ర మోదీ సారథ్యంలో 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చే నాటికే నిరుద్యోగ సమస్య వారసత్వంగా వచి్చందని, అప్పటికి పని ప్రదేశాల్లోని 42 కోట్ల ఉద్యోగుల్లో 31 కోట్ల మందికి నైపుణ్యాలు లేవని చెప్పారు. ‘‘నిరుద్యోగం పట్ల ఈ విధమైన ఆలోచన సరైంది కాదు. ఎందుకంటే ఎన్నో ఉద్యోగాలు, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు కలి్పంచాం. కానీ వారికి నైపుణ్యాలు అవసరం. స్వాతంత్య్రం వచి్చన 65 ఏళ్ల తర్వాత కూడా ప్రతి నలుగురిలో ముగ్గురికి నైపుణ్యాలు లేవు.

గత తొమ్మిదేళ్లుగా మేము దీన్ని పరిష్కరించే క్రమంలో ఉన్నాం’’అని కేంద్ర నైపుణ్యాల అభివృద్ధి శాఖ మంత్రి చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో కరోనా కాలం రెండున్నరేళ్లను మినహాయించి చూస్తే, తాము 6.25 కోట్ల యువతలో నైపుణ్యాలు కలి్పంచామని చెప్పారు. ‘‘ప్రస్తుత ప్రభుత్వం, ప్రధాని మోదీ దృష్టి అంతా స్థానికంగానే ఎన్నో ఆర్థిక అవకాశాలు కలి్పంచాలన్న దానిపైనే. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయ కళలు, నైపుణ్యాలను.. ఉత్పత్తుల ఆవిష్కరణ దిశగా పునరుజ్జీవింపజేయాల్సి ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌ ను చేరుకునేలా అనుసంధాన కలి్పంచాలి’’అంటూ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)