Breaking News

ఈ ఏడాది భారత్‌ వృద్ధి 6.6 శాతం

Published on Sat, 01/11/2025 - 07:32

భారత ఆర్థిక వ్యవస్థపై (Indian economy) ఐక్యరాజ్యసమితి ఆశావహ దృక్పథాన్ని ప్రకటించింది. 2025లో భారత్‌ జీడీపీ (GDP) 6.6 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు బలంగా ఉండడం వృద్ధికి మద్దతునిస్తుందని పేర్కొంది.

మౌలికరంగ వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న మూలధన వ్యయాల ప్రభావం రానున్న సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థపై ఎన్నో రెట్లు ఉంటుందని అంచనా వేసింది. ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2025’ పేరుతో ఐక్యరాజ్యసమితి ఒక నివేదికను (UN report) విడుదల చేసింది. భారత్‌ జీడీపీ 2024లో 6.8 శాతం వృద్ధి చెందగా, 2025లో 6.6 శాతం, 2026లో 6.8 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఈ నివేదికలో అంచనాలు వెల్లడించింది.

సేవలు, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్‌ వంటి కొన్ని రకాల వస్తు ఎగుమతుల్లో బలమైన వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుందని తెలిపింది. 2024లో వర్షాలు ఆశాజనకంగా ఉండడం 2025లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని పేర్కొంది. భారత్‌లో భారీ స్థాయి మౌలిక ప్రాజెక్టులు, ఫిజికల్, డిజిటల్‌ అనుసంధానత, సోషల్‌ ఇన్‌ఫ్రాపై ప్రభుత్వం చేస్తున్న వ్యయాలు 2025లోనూ బలంగా కొనసాగుతాయని అంచనా వేసింది.  

ద్రవ్యోల్బణం దిగొస్తుంది.. 
భారత్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 2024లో 4.8 శాతం ఉండగా, 2025లో 4.3 శాతానికి దిగొస్తుందని ఐక్యరాజ్యసమితి నివేదిక అంచనా వేసింది. మధ్యకాలానికి ఆర్‌బీఐ లకి‡్ష్యత పరిధి అయిన 2–6 శాతం మధ్యే ఉంటుందని పేర్కొంది. భారత్‌లో ఉపాధి మార్కెట్‌ 2024 వ్యాప్తంగా బలంగా ఉన్నట్టు,  కార్మికుల భాగస్వామ్యం రికార్డు స్థాయిలో ఉన్నట్టు తెలిపింది.

పట్టణ ప్రాంత నిరుద్యోగం 2023లో 6.7 శాతంగా ఉంటే, 2024లో 6.6 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం మెరుగుపడినట్టు తెలిపింది. ఇక అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2025లో 2.8 శాతం, 2026లో 2.9 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2023, 2024లో 2.8 శాతంగా ఉండడం గమనార్హం.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)