Breaking News

బలమైన వాణిజ్య భాగస్వామ్యాలు అవసరం 

Published on Sun, 07/27/2025 - 04:36

ముంబై: బలమైన వాణిజ్య భాగస్వామ్యాలు భారత్‌కు వ్యూహాత్మక అవకాశాలను తీసుకొస్తాయని.. అంతర్జాతీయంగా విలువ ఆధారిత సరఫరా వ్యవస్థతో అనుసంధానతను పెంచుకోవచ్చని ఆర్‌బీఐ బులెటిన్‌ పేర్కొంది. వాణిజ్య విధానపరమైన అనిశ్చితులు నెలకొన్నప్పటికీ జూన్‌–జూలై నెలల్లో ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగినట్టు తెలిపింది. సమగ్ర ఆర్థిక, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్‌–యూకే గురువారం సంతకం చేయనుండడం గమనార్హం.

 అమెరికాతోనూ ఈ దిశగా చర్చలు నిర్వహిస్తుండడం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితిపై బుధవారం ఆర్‌బీఐ బులెటిన్‌ విడుదలైంది. వాణిజ్య విధానపరమైన అనిశ్చితుల కారణంగా జూన్‌ నుంచి జూలైలో ఇప్పటి వరకు అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక వాతావరణం అస్థిరంగా ఉన్నట్టు తెలిపింది. ‘‘ఈ కాలంలో దేశీ ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగాయి. 

ఖరీఫ్‌ సాగు పరిస్థితులు మెరుగుపడడం, సేవల రంగంలో బలమైన పనితీరు, పారిశ్రామిక పనితీరులో మోస్తరు వృద్ధి మద్దతుగా నిలిచాయి’’అని బులెటిన్‌ వివరించింది. అమెరికాతో ఆగస్ట్‌ 1కి ముందుగానే వాణిజ్య ఒప్పందం కోసం తీవ్రమైన చర్చలు నడుస్తున్నాయంటూ.. అమెరికా వాణిజ్య విధానాలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాలను పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. 

సగటు వాణిజ్య టారిఫ్‌లు 1930ల తర్వాత ఎన్నడూలేని స్థాయిలకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఇతర రంగాలపైనా అదనంగా కొత్త టారిఫ్‌లు విధించే రిస్క్‌ లేకపోలేదని తెలిపింది. ఈ అనిశ్చితులు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి విఘాతం కలిగించొచ్చని అభిప్రాయపడింది. వ్యవస్థలో తగినంత లిక్విడిటీ ఉండడం రేట్ల కోత బదిలీకి వీలు కల్పిస్తుందని.. విదేశీ మారకం నిల్వలు సమృద్ధిగా ఉండడం, విదేశీ మారకం రుణభారం మోస్తరుగా ఉండడాన్ని సానుకూలతలుగా పేర్కొంది.   

చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి ఆజ్యం 
చమురు ధరలు 10% పెరిగితే రిటైల్‌ ద్రవ్యోల్బణం 0.20% అధికమవుతుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ప్ర త్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు విధానపరమైన చర్యలకు ఆర్‌బీఐ ఉద్యోగులు విడుదల చేసిన అధ్యయన పత్రం పిలుపునిచ్చింది. ఈ భారం వినియోగదారులపై అధికంగా పడకుండా ఎక్సైజ్‌ సుంకాలను తగ్గించే వెసులుబా టు ప్రభుత్వానికి ఉన్నట్టు తెలిపింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)