Breaking News

దేశవ్యాప్తంగా కోటి మందికి ఆధార్ అప్‌డేట్‌ పూర్తి

Published on Mon, 02/09/2026 - 11:56

దేశంలోని పాఠశాల విద్యార్థుల ఆధార్ డేటా అప్‌డేట్ ప్రక్రియలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా సుమారు 83,000 పాఠశాలల్లో చదువుతున్న కోటి మందికి పైగా విద్యార్థులకు ‘తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్స్’ (ఎంబీయూ) పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.

ఎందుకు ఈ అప్‌డేట్ తప్పనిసరి?

సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు చేసే సమయంలో కేవలం ఫొటో, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను మాత్రమే సేకరిస్తారు. ఆ వయసులో పిల్లల వేలిముద్రలు, కనుపాప (ఐరిస్‌) గుర్తులు పూర్తిగా పరిపక్వం చెందవు కాబట్టి వాటిని తీసుకోరు. అయితే 5 ఏళ్లు, 15 ఏళ్లు దాటిన తర్వాత పిల్లలు తమ బయోమెట్రిక్ వివరాలను ఆధార్‌లో అప్‌డేట్ చేయడం అత్యవసరం. ఈ వివరాలు అప్‌డేట్ చేయకపోతే భవిష్యత్తులో నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి కూడా ఈ అప్‌డేట్‌ తప్పనిసరి.

ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం

విద్యార్థులకు వీలుగా యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు అక్టోబర్ 1 నుంచి ఏడాది పాటు ఈ బయోమెట్రిక్ అప్‌డేట్‌ను ఉచితంగా అందిస్తోంది. పాఠశాలల్లో నిర్వహించే ప్రత్యేక శిబిరాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ కేంద్రాల్లో కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఇప్పటికే కేంద్రాల ద్వారా సుమారు 1.3 కోట్ల అప్‌డేట్లు పూర్తయ్యాయి.

సాంకేతికతతో వేగవంతం

సెప్టెంబర్ 2025లో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్‌ఈ+) అప్లికేషన్‌తో ఆధార్ డేటాను అనుసంధానం చేయడం వల్ల ఈ ప్రక్రియ వేగవంతమైంది. దీని ద్వారా ఏ విద్యార్థికి అప్‌డేట్ అవసరమో సులభంగా గుర్తించి నేరుగా పాఠశాలల్లోనే శిబిరాలు నిర్వహిస్తున్నారు. ‘దేశంలోని అన్ని పాఠశాలలు కవర్ అయ్యే ఈ ప్రక్రియ కొనసాగుతుంది’ అని యూఐడీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఉడాయ్‌ సీఈఓ భువనేష్ కుమార్.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాస్తూ పాఠశాలల్లో శిబిరాల నిర్వహణకు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి: రిస్క్‌ లేకుంటే రాబడి లేదు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)