Breaking News

యుకో బ్యాంక్‌ డబుల్‌ ధమాకా!

Published on Wed, 01/25/2023 - 18:30

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ సంస్థ యుకో బ్యాంక్‌ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో రూ. 653 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో సాధించిన రూ. 310 కోట్లతో పోలిస్తే ఇది 110 శాతం వృద్ధి. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి.

స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 8 శాతం నుంచి 5.63 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్‌పీఏలు 2.81 శాతం నుంచి 1.66 శాతానికి తగ్గాయి. స్లిప్పేజీల కంటే రికవరీలు పెరగడంతో మొండి రుణాలకు కేటాయింపులు రూ. 565 కోట్ల నుంచి రూ. 220 కోట్లకు తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) రూ. 3,919 కోట్ల నుంచి రూ. 4,627 కోట్లకు బలపడింది. కనీస మూలధన నిష్పత్తి 14.32 శాతంగా నమోదైంది. ఈ కాలంలో ఆర్‌బీఐ రూ. 88 లక్షల జరిమానా విధించినట్లు బ్యాంక్‌ వెల్లడించింది. క్యూ3 ఫలితాల నేపథ్యంలో యుకో బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 29.50 వద్ద ముగిసింది.

చదవండి: మెగా రిపబ్లిక్ డే సేల్స్‌.. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ షాపింగ్‌పై భారీ ఆఫర్స్‌

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)